12, నవంబర్ 2015, గురువారం

ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం.

పవన్ తో చంద్రబాబు కీలక భేటీ..

ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం.

AP కి దీపావళి వెలుగులు.

11, నవంబర్ 2015, బుధవారం

ఆప్కా నంబర్ భీ ఆయేగా....

ఉద్యోగులకు షాక్...గ్రాట్యుటీ 10 లక్షలకు పరిమితి..

ముందు రైతులతో మొదలు పెట్టారు,తర్వాత డ్వాక్రా మహిళలకు ,తర్వాత నిరుద్యోగులకు..ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఒక పద్దతి ప్రకారం లైను గా ఇస్తారు...షాకులు...

అందరూ ఒకేసారి తొందర పడితే ఎలా ..కొంచెం ఓపిక పట్టాలి..

ఆప్కా నంబర్ భీ ఆయేగా....

ఇప్పటికైనా నిజాలు మాట్లాడి..నిజాలు చూపించండి..



ఒకవైపు విభజనకు తానే రెండుసార్లు లేఖలు ఇచ్చానని రొమ్ము విరుచుకొని చెబుతుంటే..

మీడియా మాత్రం సమైఖ్యం కోసం పోరాడిన  జగన్ ను మాత్రం విభజనకు కారణం అని ప్రచారం చేసింది..

విభజన అయిపోయిన తర్వాతైనా  మారారా...

ఈ రోజు రాయలసీమ కోసం గొంతులు  ఎత్తుతుంటే..

ఆ గొంతులు ఎత్తడానికి ఎవరు కారణం అని ఒక్క రోజైనా చూపించారా..

రాజధానులు, శంకుస్థాపన అయిన ప్రాజెక్ట్ లు ,వైద్య సీట్లు ఏక పక్షంగా తరలి పోతుంటే దానికి కారణం అయిన వారిని ఒక్కసారైనా నిలువరించారా..ఈ మీడియా వాల్లు మరియు మేధావులు...

కానీ నేడు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి గొంతెత్తు తున్న రాయలసీమ వాల్ల న్యాయమైన కోరికలోని పరమార్థాన్ని గ్రహించకుండా.‌దాన్ని సరిదిద్దకుండా..తిరిగి రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారు..దానికి మీడియా సపోర్ట్ చేస్తాఉంది..

ఇంకా ఎంత కాలం ప్రజల అభివృద్దిని పట్టించుకోకుండా,నిజాలను దాచి కొంతమంది వ్యక్తుల,రాజకీయ పార్టీలకోసం.. పనిచేస్తారు.

9, నవంబర్ 2015, సోమవారం

రాయలసీమ వెనుకబాటుకు స్థానిక నేతలే..కారణం.- చంద్రబాబు.

రాయలసీమ వెనుకబాటుకు స్థానిక నేతలే..కారణం.- చంద్రబాబు.

అవునా..సార్..

రాజధాని రాయలసీమకు ఇస్తా ఉంటే..ఏ రాయలసీమ స్థానిక నాయకుడు అడ్డుకున్నాడు..

రాయలసీమకు కేటాయించిన aims లాంటి సంస్థలను ఇంకా..కొన్ని ప్రాజెక్ట్ లను తరలించమని ఏ స్థానిక నాయకుడు చెప్పాడు..

శ్రీశైలం లో కనీస నీటి మట్టాన్ని ఉంచకుండా ఏ స్థానిక నాయకుడు అడ్డుకున్నాడు..

పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం లో స్థానికులకు సీట్లు రాకుండా 120 go తెమ్మని ఏ స్థానిక నాయకుడు సలహా ఇచ్చారు...

పట్టిసీమ go లో రాయలసీమకు
నీల్లు అని లేకున్నా రాయలసీమను సస్యశ్యామలం  చేయడానికే అని చెప్పమని ఏ స్థానిక నాయకుడు చెప్పాడు..

రాక  రాక వెనుకబడిన  కడప జిల్లాకు బ్రాహ్మణి అనే ఉక్కు పరిశ్రమ వస్తే..దాన్ని ఆపమని ఏ స్థానిక నాయకుడు అడ్డుపడ్డాడు.

హంద్రినీవా పంపును ఎత్తుకొని  పోయి  పట్టిసీమ లో బిగించమని ఏ స్థానిక నాయకుడు చెప్పాడు..

రాయలసీమ వాడివని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా!

అదేంది రాయలసీమ వాడివని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా!
ముందు ఉన్న ఒడంబడికలను తుంగలో తొక్కి రాజధాని ప్రాంతాన్ని ఏకపక్షంగా ప్రకటించి జగన్ ను ఇరుకున పెట్టి ఒప్పించుకున్నప్పుడు,
ఇక్కడకు రావాల్సిన ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు తరలించినప్పుడు..
ఇక్కడి మహిళా విద్యార్థులకు రావలసిన వైద్య విద్య సీట్లు అందరికీ అని చెబితే రాయలసీమ విద్యార్త్జులు హైకోర్ట్ కు వెలితే , హైకోర్ట్ కొట్టి వేసినా కూడా సుప్రీమ్ కోర్ట్ కు వెల్లినప్పుడు...
రాయలసీమ లో చాలా మటుకు పూర్తి అయ్యి ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా..యుద్ద ప్రాతిపదికన ఇక్కడ ఉండే పంపు ఎత్తుకొని పోయి పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టినప్పుడు....
కరువుతో ప్రజలు వలసలు,పశువులు కబేళాలకు తరులుతున్న సమయం లో అట్టహాసంగా రాజధాని శంకుస్థాపన పనులు చేస్తున్న సమయం లో...
రాయలసీమ వాల్లకు నాగరికత లేదు,వాల్లకు బియ్యం తినడం నేర్పింది తమరే అని సెలవు ఇచ్చినప్పుడు..
గుర్తుకు రాలేదా...తమరు రాయలసీమ వాల్లు అని..ఇక్కడ కూడా మనుషులే ఉంటారని...

ఎవరు తెలివైన వాల్లు

ఎవరు తెలివైన వాల్లు
ప్యాకేజీ లు నమ్మని .. వెనుకబడ్డారని చెప్పుకునే..బీహార్ వాల్లా...
లేక ఎంతో అభివృద్ది చెందినామని IT లో ప్రపంచానికే పాఠాలు చెప్పినామని సంకలు కొట్టుకుని ఉచిత హామీలను హోదాలను నమ్మిన .AP వాల్లా..

5, జూన్ 2015, శుక్రవారం

రేవంత్ రెడ్డి దొరికి పోయి సరి పోయింది...


.....లేక పోతే ఈ పాటికి ఆయనను వీరుడు,శూరుడు,అపరచాణుక్యుడు..MLA లు లేకున్నా కూడా చక్రం తిప్పి MLC ని 

గెలిపించుకున్నాడు అని ,ఆంధ్ర లో భీభత్సంగా జరుగుతున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీ MLA లు ఓట్లు వేసారు అని...ఇంకా 

ఎన్నో.. మన మీడియా తెగ భజన చేసి మన చెవుల తుప్పు వదిలేటట్లుగా బాకాలు ఊదేవి..