జగన్ గారు ఓదార్పు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రాంతం లో పర్యటించినపుడు ,ఎంతో మంది భక్తుల ఆరాధ్య దైవమైన సాయిబాబా గారు పరమ పదించిన తర్వాత ఆయన కుమారుడైన రత్నాకర్ గారిని జగన్ గారు మానవతా దృక్పథం తో పరామర్శించడం కొంత మీడియా బురద చల్లడానికి ఒక అవకాశంగా తీసుకొని తిరిగి తమ విశ్వసనీయతను మరొక సారి పోగొట్టుకున్నాయి.జగన్ గారి ఓదార్పు యాత్రకు వస్తున్న స్పందన చూసి దాన్ని తగ్గించి చూపడానికి కొన్ని మీడియా సంస్థలు ఈ పనికి పూను కొన్నాయి.జగన్ గారు ఓదార్పు యాత్ర కు ఒక ప్రాంతానికి వెళ్ళినపుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖులు అనారోగ్యం పాలైనపుడు గాని ,వాళ్ళ బంధువులు చనిపోయినపుడు గాని వాళ్ళు తమతో రాజకీయంగా విభేదించినప్పటికీ వాళ్ళను పరామర్శిం చడం ఆనవాయితీ.అది వాళ్ళ మానవత్వానికి ఒక నిదర్శనం.ఉదాహరణకు ఎం.పి . హర్షకుమార్ గారు ఆసుపత్రి లో ఉన్నప్పుడు కూడా జగన్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరామర్శించారు.జగన్ గారు మాత్రమే కాదు,వాళ్ళ తండ్రి రాజశేఖరరెడ్డి గారికి కూడా శత్రువులకు కూడా సహాయం చేసే లక్షణం ఉంది.అందుకే వాళ్లకు ప్రజలలో విశ్వసనీయత ఉంది. మిగతా రాజకీయ నాయకుల లాగా ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలకు డ్రామాలు వినిపించి తర్వాత ప్రజలను పట్టించు కోకుండా ఉండే రకం కాదు.సాయబాబా గారు జీవించి ఉన్నప్పుడు ఆయన చుట్టూ చీటికీ మాటికి తిరిగి ఆయన దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు కనిపించి ఆయన ద్వారా పనులు చేయించుకొని ,ఆయన మరణ శయ్య మీద ఉన్నప్పుడు తమ తమ ఆర్ధిక లావాదేవీలు పరిష్కరించుకొని తర్వాత అటువైపు చూడని పెద్దమనుషులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.వై.ఎస్.వాళ్ళు ఎప్పుడూ అటువంటి పనులు చేయలేదు,మీడియా ద్వారా నాయకులు కాలేదు .దమ్ముగా ప్రజలలో నుండి వచ్చారు,ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు.ఇప్పటికైనా మీడియా సంస్థలు ప్రజలు నవ్వుకునేటట్లు ఉన్న తమ గోబెల్స్ ప్రచారం మానుకుంటే కొంతవరకైనా వాళ్ళ విశ్వసనీయతను నిలుపుకుంటారు.
23, జూన్ 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)