ఊర్లలో పొలాల కోసం కావలి వాండ్లు ఉండే వారు.ఇప్పటికీ కూడా ఈ పద్దతి చాలా ఊర్లలో ఉంది.ఊరి పంచాయితీ మరియు పెద్దమనుషులు కలిసి వాళ్ళను పెట్టే వారు.చాలా సందర్భాలలో ఈ కావలి వాండ్లు దళిత కులాలకు చెందిన వారే ఉండే వారు.వాళ్ళు ఊరి మొదట్లో ఒక కర్ర చేత బట్టుకొని ఉండే వారు.ఊర్లోని వాళ్ళు ఎవరైనా సరే పంటల సమయం లో  పొలాల్లో నుండి కోసుకు రాకుండా ఉండడానికి వీళ్ళను పెట్టే వారు  (పంటలు కోసే సమయం లో తప్ప ).దీనివలన ఇతరుల పంటలను దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉండేది.ఒక వేళ ఆ సమయంలో ఎవరైనా పంటను తీసుక వస్తే వాళ్లకు జుర్మానా విధించి ఆ డబ్బును పంచాయితీకి జమ చేసేవాళ్ళు.వీళ్ళను  చూస్తే ఎవరికైనా భయం ఉండేది.నూరు ఎకరాల ఆసామి అయినా వాళ్లకు భయపడే వాడు.పెద్దగా చదువుకోని పల్లెటూరి సమాజాలల్లో కూడా వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల  పట్ల అంత గౌరవం ఉండేది.కానీ నేడు బాగా చదువుకున్న నాగరిక సమాజం(?) లో కూడా వ్యవస్థలకు విలువ లేకుండా పోయింది.పోలీసులు చివరికి ముఖ్యమంత్రి ,ప్రధాన మంత్రి  వంటి ప్రధాన మైన వ్యవస్థలకు కూడా విలువ ఇవ్వడం లేదు.
16, డిసెంబర్ 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
 
 

 
 


 




 
 పోస్ట్లు
పోస్ట్లు
 
