9, నవంబర్ 2015, సోమవారం

రాయలసీమ వాడివని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా!

అదేంది రాయలసీమ వాడివని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా!
ముందు ఉన్న ఒడంబడికలను తుంగలో తొక్కి రాజధాని ప్రాంతాన్ని ఏకపక్షంగా ప్రకటించి జగన్ ను ఇరుకున పెట్టి ఒప్పించుకున్నప్పుడు,
ఇక్కడకు రావాల్సిన ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు తరలించినప్పుడు..
ఇక్కడి మహిళా విద్యార్థులకు రావలసిన వైద్య విద్య సీట్లు అందరికీ అని చెబితే రాయలసీమ విద్యార్త్జులు హైకోర్ట్ కు వెలితే , హైకోర్ట్ కొట్టి వేసినా కూడా సుప్రీమ్ కోర్ట్ కు వెల్లినప్పుడు...
రాయలసీమ లో చాలా మటుకు పూర్తి అయ్యి ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా..యుద్ద ప్రాతిపదికన ఇక్కడ ఉండే పంపు ఎత్తుకొని పోయి పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టినప్పుడు....
కరువుతో ప్రజలు వలసలు,పశువులు కబేళాలకు తరులుతున్న సమయం లో అట్టహాసంగా రాజధాని శంకుస్థాపన పనులు చేస్తున్న సమయం లో...
రాయలసీమ వాల్లకు నాగరికత లేదు,వాల్లకు బియ్యం తినడం నేర్పింది తమరే అని సెలవు ఇచ్చినప్పుడు..
గుర్తుకు రాలేదా...తమరు రాయలసీమ వాల్లు అని..ఇక్కడ కూడా మనుషులే ఉంటారని...

ఎవరు తెలివైన వాల్లు

ఎవరు తెలివైన వాల్లు
ప్యాకేజీ లు నమ్మని .. వెనుకబడ్డారని చెప్పుకునే..బీహార్ వాల్లా...
లేక ఎంతో అభివృద్ది చెందినామని IT లో ప్రపంచానికే పాఠాలు చెప్పినామని సంకలు కొట్టుకుని ఉచిత హామీలను హోదాలను నమ్మిన .AP వాల్లా..

5, జూన్ 2015, శుక్రవారం

రేవంత్ రెడ్డి దొరికి పోయి సరి పోయింది...


.....లేక పోతే ఈ పాటికి ఆయనను వీరుడు,శూరుడు,అపరచాణుక్యుడు..MLA లు లేకున్నా కూడా చక్రం తిప్పి MLC ని 

గెలిపించుకున్నాడు అని ,ఆంధ్ర లో భీభత్సంగా జరుగుతున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీ MLA లు ఓట్లు వేసారు అని...ఇంకా 

ఎన్నో.. మన మీడియా తెగ భజన చేసి మన చెవుల తుప్పు వదిలేటట్లుగా బాకాలు ఊదేవి..

5, డిసెంబర్ 2014, శుక్రవారం

రాయలసీమ కళాకారులు ..

              ఒక చిన్న స్టీలు స్కేలు ,ఉలి ,బొగ్గు ,చిన్న సుత్తె తో బేతంచర్ల పని వారు అక్కడి నాప రాళ్ళతో రకరకాల లతలు,పుష్పాలు ,ఫ్లోరింగ్ డిజైన్లను చాలా అద్బుతంగా చేస్తారు.అందులో చాలా జామెట్రీ దాగి ఉంది.ఏ పరికరమూ ,యంత్ర సహాయం లేకుండా చాలా ఖచ్హితంగా చేస్తారు.కానీ ఈ మధ్యన ఈ ఆర్టిఫిసీల్ టైల్స్ వచ్హిన తర్వాత వారికి పని తగ్గి పోయింది.ఈ పని లో చాలా మటుకు ముస్లిం మైనారిటీ కి చెందిన వారు ,వెనుక బడిన కులాలకు చెందిన వారు ఉపాధి పొందుతూ ఉండేవారు.ఉపాధి తగ్గినందువలన కొత్త తరం ఈ పనిలోకి రావడానికి జంకుతున్నారు.ఇప్పటికే ఎన్నో కళల ను మనం కోల్పోయాము.కావున ప్రభుత్వం,పెద్దలు స్పందించి ఇటువంటి కళను ,కళాకారులను దూరం కాకుండా చేసు కోవలసిన అవసరం ఉంది.