కాంగ్రెస్స్ కొత్త నాటకానికి తెరతీయవచ్చు. వచ్చే ఎన్నికల వరకూ సమైక్య ఆంధ్ర ఉద్యమ వేడి అలాగే ఉండనిచ్చి లేక పోతే అందరిచేతా రాజీనామా చేయించి ,సీమాంధ్ర కాంగ్రెస్స్ నాయకులతో ఒక ప్రతిపాదన తెర పైకి తీసుకు రావచ్చు. (ఎందుకంటే ఇప్పటికే సమైఖ్య ఉద్యమకారులు ప్రజా ప్రతినిధుల రాజీనామాలు కోరుకుంటున్నారు ,ఒకవేళ రాజీనామాలు చేస్తే తిరిగి గెలిపించుకుంటామని హామీలు కూడా ఇస్తున్నారు.) . అదేమంటే సమైఖ్య ఆంధ్ర కోరుకునే వాళ్ళందరూ పార్టీలకతీతంగా జెఎసి తరపున ఇప్పుడున్న తమతమ స్థానాలలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి గెలవడం. తిరిగి కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్స్ లో కలవడం . దీని వలన సీమాంధ్ర లో కాంగ్రెస్స్ మెజారిటి కి ఏమీ ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్స్ కు ఇంతకంటే ఏం కావాలి.
10, సెప్టెంబర్ 2013, మంగళవారం
2, ఆగస్టు 2013, శుక్రవారం
.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది!
అప్పుడు కర్నూల్ రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ ఏమీ వసతులు లేవని హైదరాబాదుకు రమ్మన్నామని చెబుతూ ఉండేవారు . ఇప్పుడు ఏమి వసతులు ఉన్నాయని తిరిగి పొమ్మంటున్నారు . అంతా స్వార్థం . కావున ముందు సీమాంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు వికేంద్రీకరించి , పొలాలకు నీటి వసతి కల్పించి అందరి సమ్మతి తో హైదరాబాదుకు దీటుగా ఒక రాజధానిని నిర్మించి తర్వాతనే రాష్ట్ర విభజన చేసి పొమ్మనాలి. అంత వరకు ఇప్పుడెలా గుందో అలాగే ఉండనివ్వాలి.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.
31, జులై 2013, బుధవారం
సీమాంధ్రులు ద్రోహులు ,దోపిడీ దారులని కాంగ్రెస్స్ నాయకత్వం నమ్మిందా?
ఇన్నాళ్ళు తెలంగాణా నాయకులు సీమాంధ్ర వాళ్ళను ద్రోహులు,దోపిడీ దారులు అని చెబుతూ వచ్చారు . వాళ్ళ దోపిడీ నుండి కాపాడుకోవడానికే తెలంగాణా కావాలని అందరికీ చెబుతూ వచ్చారు . ఇప్పుడు కాంగ్రెస్స్ వాళ్ళు ఆ మాటలు నిజమని నమ్మి తెలంగాణా ఇచ్చారా లేక ఏదైనా ప్రాతిపదిక ఉందా ,సీమాంధ్రు లకు తెలప వలసిన బాధ్యత ఉంది .
30, జులై 2013, మంగళవారం
భావోద్వేగాలను రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ పండగ!
తెలంగాణా తెచ్చుకున్నట్లు కాదు,ఒక వేల ఇస్తే ! భావోద్వేగాలను రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ పండగ,ఎందుకంటే తెలంగాణా ఇస్తే తాము ఏదో ఊడ పొడుస్తామని తెలంగాణా ప్రజలందరికీ అరచేతిలో స్వర్గం చూపెట్టారు . ఇప్పుడు తెలంగాణా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు. ఇంత భావోద్వేగం తో తెచ్చుకున్న తర్వాత ప్రజలు మార్పును చాలా తొందరగా కోరుకుంటారు . వాళ్ళను ఎలా మభ్య పెట్టారంటే వాళ్ళు ఏమీ పని చేయకుండానే ఇంట్లోకి డబ్బులు వచ్చి పడతాయని చెప్పారు. కోరుకున్నన్ని ఉద్యోగాలు ,బంగళాలు దొరుకుతాయని ఆశ పెట్టారు. అక్కడి ప్రజలు ఒకటి ,రెండు సంవత్సరాలు చూస్తారు,వాళ్ళు కోరుకున్న మార్పు ఏమీ కనపడదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతగా అభివృద్ధి చెందలేదు .కావున తెలంగాణా ఇచ్చిన పార్టీకి, తెచ్చామని చెప్పిన పార్టీకి ఇద్దరికీ ప్రజలు వాతలు పెట్టి తాము ఎవరికీ ఓట్లు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)