10, ఏప్రిల్ 2013, బుధవారం

శుభాకాంక్షలు

అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు . 

8, ఏప్రిల్ 2013, సోమవారం

ఏ దాహం కోసం తమ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసారు?

అధికార  డబ్బు దాహం వల్లనే జగన్ కు ఇబ్బందులు వచ్చాయంటున్న  పెద్ద మనిషి ,ఏ దాహం కోసం తన పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేసారో చెబితే బావుంటుంది .ఇలా డబల్ స్టాండర్డ్స్ మాట్లాడే చాలా మంది రాజకీయ నాయకులు తమ విశ్వసనీయతను పోగొట్టుకొన్నారు.

20, మార్చి 2013, బుధవారం

ప్రజల కన్నీళ్ళ గురించి చర్చలు పెడితే బాగుంటుంది !

ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాలో జరుగుతున్న చర్చలు ఈ మధ్యన ఎటుపోతున్నాయో అర్థం కావడం లేదు. నాయకుల కన్నీళ్ళ గురించి చర్చలు పెడతారు. రాజకీయ నాయకులు ఒకరినొకరు  వ్యక్తిగతంగా దూషించుకున్న తర్వాత ఫలానా  ఆయన ఫలానా  ఆయన గురించి అలా తిట్టాడు,ఆ తిట్టుకు అతడు అర్హుడేనా , నిజమేనా అని sms లు అడుగుతారు. కోర్టులలో జరుగుతున్న విషయాల మీద ఇక్కడ చర్చలు పెడతారు,వీళ్ళే ఎవరు దోషో ,ఎవరు నిర్దోషో  తేల్చేస్తారు. భార్యా భర్తల మధ్యన వచ్చే చిన్న చిన్న తగాదాలను కూడా ఇక్కడ తీసుకు వచ్చి చర్చకు పెడతారు.  భార్యా భర్తలు మద్యన చిన్న చిన్న సమస్యలు వచ్చి  అభిప్రాయభేదాలు రావచ్చు ,తర్వాత వాళ్ళే కలసి పోయే అవకాశం  ఉంది . కానీ లైవ్ లో వీళ్ళు పెట్టే  చర్చల  లో భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు పై చేయి సాధించుకోవడానికి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు.ఇంకా మానసికంగా దూరమవుతారు . వీళ్ళు చేసే నిర్వాకం వలన కలసి పోయేదానికంటే ,దూరమయ్యే అవకాశమే ఎక్కువ. ఈ చర్చలు చూడాలంటేనే వెగటు పుడుతూ ఉంది . ప్రజల కన్నీళ్ళ గురించి,వాళ్ళ బాధల గురించి మీడియా చర్చలు పెడితే బాగుంటుంది.

16, మార్చి 2013, శనివారం

తమ తాత్కాలిక స్వార్థ ,రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టారు.

తమ తాత్కాలిక స్వార్థ ,రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టి అధికార పక్షానికి భుజం భుజం కలిపి దన్నుగా నిలబడ్డారు.కానీ ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువగా అంచనా వేయరాదు. ప్రజల కోసం కాకుండా తమ స్వార్థాల కోసం పని చేసే రాజకీయ పార్టీ లను తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు  రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఎల్లప్పుడూ సర్వ సన్నద్దులై  ఉంటారు .