6, జులై 2010, మంగళవారం

రాయలసీమ మాండలికం లో వాడే కొన్ని పదాలు

రాయలసీమ(జమ్మలమడుగు,ప్రొద్దుటూరు ప్రాంతాలలో పల్లెల్లో ) లో వాడే కొన్ని పదాలు మధ్య కనుమరుగవుతున్నాయి.ఒకసారి గుర్తు చేసుకుంటూ..

అమ్మలపొద్దు = ఉదయం తొమ్మిది గంటల సమయం.
పైటాల = మధ్యాన్నం.
మాయిటాల = పొద్దు గూకే వేళ.
వాకిలి =తలుపు.
సిలుకు = తలుపుకు పెట్టే గొళ్ళెం లాంటిది.
గడెమాను = తలుపుకు అడ్డంగా లోపలనుండి పెట్టే గడియ.
బూయిండ్లు = వంట గది.
నడవ = హాల్ .
ఆయిపిండ్లు = పంటలను దాచు కునే రూము.
దండెం = బట్టలను వేసేందుకు ఉపయోగించే త్రాడు లేక కర్ర.
ఉట్టి = పదార్థాలను ఎత్తిపెట్టెందుకు వేలాడదీసిన త్రాడు(గిన్నెలను పెట్టడానికి అనుకూలంగా ఉన్న).
సుట్టకూతురు = కుండలు పడిపోకుండా ఉండేదుకు కుండ క్రింద పెట్టే వృత్తాకారంలో ఉండే త్రాడు.
అటిక = మట్టికుండ.
బాణ = నీళ్ళు నింపుకునేందుకు ఉపయోగించే మట్టి కుండ .
కడవ = నీళ్ళు పట్టుకు రావడానికి ఉపయోగించే మట్టి పాత్ర.
తప్యాల = వంట వండుకునే లోహ పాత్ర.
బోకులు = లోహ పాత్రలు.
చెంబు = నీళ్ళు త్రాగడానికి ఉపయోగించే లోహ పాత్ర .
ఆబువ్వ = వరి అన్నం.
సిబ్బి = అన్నం గంజి వార్చ డానికి ఉపయోగించే వెదురుప్లేట్ .
తాపలు = మెట్లు (స్టెప్స్ ).
మెట్లు = చెప్పులు.
మచ్చు = పశువుల కోసం గడ్డిని ఉంచే ప్రదేశం.
మేపు = పశువుల కోసం ఉపయోగించే ఎండు గడ్డి.
జొల్ల = పశువుల గడ్డిని తేవడానికి ఉపయోగించే వెదురుతో చేసిన ఒక పెద్ద బుట్ట.
గాజ = ధాన్యాన్నినిలువ చేసేందుకు ఉపయోగించే వెదురు బుట్ట.
ఎనుము =బర్రె.
రొచ్చు = పశువుల మూత్రం.
తలుగు =పశువులను కట్టేందుకు ఉపయోగించే త్రాడు.
మోకు = వ్యవసాయ పనులకు ఉపయోగించే త్రాడు .
మాసీలు =పంటలు.
అబ్బ =నాన్న నాన్న.
జేజి = నాన్న అమ్మ.
తాత =అమ్మ నాన్న.
అవ్వ =అమ్మమ్మ.

పదాలు కొన్ని మధ్యన కనుమరుగు అవుతున్నాయి,వాటిని కాపాడుకోవలసిన భాద్యత ఉంది.

మరి కొన్ని పదాలు తర్వాత చూద్దాం..



29, మే 2010, శనివారం

ప్రత్యేక వాదుల ప్రజాస్వామ్యం?

మనం ఎవరింటికైనా వెళ్తా వుంటే ,మనం వాళ్ళింటికి వెళ్ళడం వాళ్లకు ఇష్టం లేక పొతే వాళ్ళు చెప్పాలి వాళ్ళింటికి రావద్దని,కానీ పక్కింటివాడు చెప్పద్దు వాళ్ళింటికి పోవద్దని.ఇదేం న్యాయమో అర్థం కావడం లేదు , మరణించిన కుటుంబాలను పరామర్శిం డానికి జగన్ పోతా ఉంటే టి.ఆర్.ఎస్ వాళ్ళు అడ్డుకోవడం ,హింస సృష్టించడం ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చేసారో అర్థం కావడం లేదు.టి.ఆర్.ఎస్ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన చనిపోయిన తెలంగాణా వాదులను ఒక రోజు కూడా పరామర్శించి ,ఆర్ధిక సాయం చేయని వీళ్ళు జగన్ మాత్రం కుటుంబాలను ఒక చోట చేర్చి ఆర్ధిక సాయం చేయాలని ,పరామర్శకు వెళ్ళవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. టి.ఆర్.ఎస్ వాళ్ళు చెప్పిన టైము లో పరామర్శకు వెళ్ళాలంట,వాళ్ళు చెప్పిన విధంగా ఆర్ధిక సాయం చేయాలంట ,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు పయనిస్తుంది,ఆటవిక సమాజంలోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారా? టి.ఆర్.ఎస్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పేలుతుంటే రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు,మేధావి వర్గాలు ఏం చేస్తున్నట్లు. ప్రత్యేక తెలంగాణా కావాలని కోరిన వాళ్ళు వాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చలామణి అవుతున్నారు,ఇది విధంగా నైతికతో అర్థం కావడం లేదు.ప్రత్యేక వాదం మాట్లాడే వాళ్లకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మంత్రులుగా పనిచేసే అర్హత లేదు.వాళ్ళు మంత్రిపదవులకు రాజీనామా చేసిన తరవాత మాత్రమే ప్రత్యేక వాదం గురించి మాట్లాడాలి.

18, మే 2010, మంగళవారం

కే.సి.ఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే విజయవాడ పర్యటన చేయాలి.

సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ప్రజలను దోచుకున్నారని ,సీమాంధ్ర ప్రజలు దోపిడిదారులని ఇన్ని రోజులు విష ప్రచారం చేసి , సీమాంధ్ర ప్రజల మనసులను గాయ పరిచిన కే.సి.ఆర్ విజయవాడ పర్యటనకు వెళ్లేముందు సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాతనే పర్యటనచేయాలి.సమైక్యాంధ్ర ఉద్యమ కారులు ,నాయకులు కే.సి.ఆర్ క్షమాపణకు పట్టుపట్టాలి.

17, ఏప్రిల్ 2010, శనివారం

కే.సి.ఆర్ గారు ఓదార్పు యాత్ర చేయరా?

రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత భాధతో మరణించిన వ్యక్తుల కుటుంబాలను ప్రాంతాలకతీతంగా పరామర్శిస్తూ ,వీలైనంత ఆర్ధిక సాయం ప్రకటిస్తున్న జగన్ గారిని కే.సి.ఆర్ మరియు ఆయన పార్టీ వాళ్ళు అభినందించాల్సి పోయి విమర్శించడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది.కే.సి.ఆర్ మరియు టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన తెలంగాణా లోని అమాయక ప్రజలు కొంత మంది ప్రాణ త్యాగం చేసినారు.తెలంగాణా కోసం అమరులైనారని పదేపదే చెప్పుకొని శవ రాజకీయాలు చేస్తున్న టి.ఆర్.ఎస్ వాళ్ళు కుటుంబాలను ఒకసారైనా పరామర్శించి,వాళ్లకు ఏమైనా ఆర్ధిక సాయం చేశారా? విషయం చూస్తే తెలుస్తుంది,టి.ఆర్.ఎస్ వాళ్లకు తెలంగాణా ప్రజల మీద ఉన్నప్రేమ.తెలంగాణా ప్రజల మేలు కోసమే తెలంగాణా రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పుకుంటున్న టి.ఆర్.ఎస్ .పార్టీ కి పదవుల మీద ఉన్న ఆసక్తి తెలంగాణా ప్రజల మీద లేనట్లుంది. ఇటువంటి వాళ్ళ వలన వచ్చిన తెలంగాణా(ఒక వేళ వస్తే) విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో తెలంగాణా ప్రజలు ఒక సారి ఆలోచన చేయాలి.