తమ పార్టీ ని గెలిపిస్తే సామాన్య ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఆంధ్ర ని సింగపూర్ చేస్తామని హామీ లు ఇస్తున్నారు. అసలు సింగపూర్ ఎలా ఉందో అక్కడ ఏముందో సామాన్య ప్రజలకు ఏం తెలుసు. వాళ్ళు అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదుగా!కావున సింగపూర్ మాటలు కాకుండా తాము అధికారం లోకి వస్తే ఏం చేస్తామో చెబితే బాగుంటుంది .
16, ఏప్రిల్ 2014, బుధవారం
తెలంగాణా విధ్వంసం లో కె.సి.ఆర్ పాత్ర !
సీమాంధ్ర పాలనలో తెలంగాణా లో హిరోషిమా,నాగసాకి తరహాలో విధ్వంసం జరిగింది అంటున్న కె.సి.ఆర్ ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలి. అదే సీమాంధ్ర పాలనలో తను కూడా మంత్రిగా పని చేసారు. అధికారాన్ని అనుభవించారు . ఒక వేల ఆయన చెప్పినట్లు విధ్వంసం జరిగి ఉంటే దానికి ఆయన కూడా బాధ్యత వహించాలి . తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
6, అక్టోబర్ 2013, ఆదివారం
ఓటుకు డబ్బులు తీసుకోవడం ధర్మమేనా!
చాలా మంది డబ్బులు తీసుకొని ఓటు వేయకూడదని చెబుతూ ఉంటారు.కానీ వివిధ పార్టీల నాయకులు ఇచ్హే డబ్బులు వాల్లేమీ స్వంతం చెమటోడ్చి కష్టపడి సంపాదించినవి కావు.అవి ప్రజలవే.ప్రజలు తమ డబ్బు తాము తీసుకొని పోటీ చేసిన వాల్లలో తమకు నచ్హిన వాల్లకు ఓటు వేస్తుంటారు.ఎందుకంటే అందరు అభ్యర్థులు డబ్బులు ఇస్తున్నారు.ఇది తప్పు కాదనుకుంటాను.ఒక వేల వీల్లు డబ్బులు తీసుకోకున్నా అవినీతి చేసే నాయకులు చేయకుండా ఉండరు.ప్రజలు డబ్బులు తీసుకోవడం వలన రాజకీయ నాయకులను కొంచమైనా ఆర్థికంగా తగ్గించ గలుగుతున్నారు.
10, సెప్టెంబర్ 2013, మంగళవారం
కాంగ్రెస్స్ కొత్త నాటకానికి తెరతీయవచ్చు!
కాంగ్రెస్స్ కొత్త నాటకానికి తెరతీయవచ్చు. వచ్చే ఎన్నికల వరకూ సమైక్య ఆంధ్ర ఉద్యమ వేడి అలాగే ఉండనిచ్చి లేక పోతే అందరిచేతా రాజీనామా చేయించి ,సీమాంధ్ర కాంగ్రెస్స్ నాయకులతో ఒక ప్రతిపాదన తెర పైకి తీసుకు రావచ్చు. (ఎందుకంటే ఇప్పటికే సమైఖ్య ఉద్యమకారులు ప్రజా ప్రతినిధుల రాజీనామాలు కోరుకుంటున్నారు ,ఒకవేళ రాజీనామాలు చేస్తే తిరిగి గెలిపించుకుంటామని హామీలు కూడా ఇస్తున్నారు.) . అదేమంటే సమైఖ్య ఆంధ్ర కోరుకునే వాళ్ళందరూ పార్టీలకతీతంగా జెఎసి తరపున ఇప్పుడున్న తమతమ స్థానాలలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి గెలవడం. తిరిగి కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్స్ లో కలవడం . దీని వలన సీమాంధ్ర లో కాంగ్రెస్స్ మెజారిటి కి ఏమీ ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్స్ కు ఇంతకంటే ఏం కావాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)