12, జనవరి 2013, శనివారం

శుభాకాంక్షలు

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .

8, జనవరి 2013, మంగళవారం

ఎక్కడికి పోతున్నాం మనం ఇంక చాలు .....

రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యం ఈ మధ్యన ఎక్కువైంది.తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకాయనేమో ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టండి అంటాడు.ఇంకొక ఆయనేమో ఒక మెజారిటీ మతానికి వ్యతిరేకంగా ప్రజల హర్షధ్వానాల మధ్యన తన నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడాడు.ఈ మధ్యన హిందూ దేవుళ్ళను ,దేవతలను విమర్శిం చడం ఒక ఫ్యాషన్ అయి పోయింది.ఒక జీసస్ కానీ ,మహమ్మద్ ప్రవక్త కానీ ,రాముడు కానీ ,కృష్ణుడు కానీ ఇన్ని రోజులు ఉన్నా కూడా  ప్రజలకు  తమ ఆరాధ్య దైవాలుగా ఉన్నారంటే నే చరిత్రలో వాళ్లకు ఒక బలమైన స్థానం ఉంది.వాళ్ళను విమర్శించే స్థాయిలో మనం ఉన్నామా అని ఒక సారి మనం ప్రశ్నించు  కోవాలి.ఇదా మనం చదివిన తర్వాత నేర్చుకున్న నాగరికత ?చదువులు మనలను ఇంత సంకుచితంగా తయారు చేసాయా?మేం చిన్నప్పుడు ఉర్సు జరిగేటప్పుడు దర్గాలకు వెళ్లి   చక్కర పంచి వచ్చేవాళ్ళం.ఇప్పటికీ కూడా పీర్ల పండుగల లో ,దస్తగిరి స్వామి పండుగలలో చాలా మంది హిందువులు మనస్పూర్తిగా ,ఉత్సాహంగా పాల్గొంటున్నారు.మెజారిటీ హిందువులకు పరమత సహనం ఉంది.ఊర్లలో చర్చి లు మసీదులు కట్టుకోవడానికి హిందువులు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి.దీన్ని హిందువుల  చేతగాని తనంగా చూస్తున్నారు.ఈ మధ్యన మాధ్యమాలల్లో కూడా చర్చ చేయడానికి ఏమీ దొరకక పోతే కుహనా మేధావులను కూర్చో బెట్టి దేవుళ్ళ గురించి  చర్చలు చేస్తున్నారు.ఒకాయనేమో ఆయన చూసి వచ్చినట్లు రావణుడు తమ దేవుడు అని పురాణాలకు వక్ర భాష్యం చెపుతాడు .దీన్ని చర్చకు పెడతారు మీడియా వాళ్ళు.ఇది ఆపుతే బాగుంటుంది.హిందూ మతాన్ని చాలా చులకన చేసి సినిమాలలో కూడా  చూపుతున్నారు. మనలను మనం గౌరవించు కోలేనప్పుడు ఇతరులు మనలను ఎందుకు గౌరవిస్తారు.తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాలను ,మతాలను గురించి రెచ్చ గొట్టే విధంగా మాట్లాడే వాళ్ళను ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలి.

6, జనవరి 2013, ఆదివారం

నష్టాలను లాభాలుగా ప్రచారం చేస్తున్నారు!

ఈ కాలంలో ప్రకటనలు ఇచ్చే వాళ్ళు  నెగెటివ్ ను పాజిటివ్ గాను పాజిటివ్ ను నెగెటివ్ గాను చెప్పుకుంటున్నారు.అలాగే ప్రజలు స్వీకరిస్తున్నారు కూడా !ఎందుకంటే అపార్ట్మెంట్ లు కట్టే వాళ్ళు ,ఇళ్ళ స్థలాల లేఅవుట్ వేసే వాళ్ళు తమ అపార్ట్మెంట్ లకు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్లు ,సినిమా హాలులు ,పరిశ్రమలు దగ్గరగా ఉన్నాయని   ప్రకటనలు ఇచ్చు కుంటున్నారు.ఒకప్పుడు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఇల్లు కట్టుకునేవారు కాదు ,ఎందుకంటే  ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందని.అలాగే ఇంటికి దగ్గర్లో సినిమా హాలు ఉంటే శబ్ద కాలుష్యం ఉంటుందని ,రకరకాల పోకిరి వ్యక్తులు వస్తారని ఇల్లు కట్టు కునే వారు కాదు.అలాగే కాలుష్యం ఉంటుందని  పరిశ్రమలకు దూరంగా ఇల్లు కట్టుకునేవారు.కానీ నేడు ఆ నష్టాలనే లాభాలుగా ప్రచారం చేస్తున్నారు.ప్రజలు కూడా  వాటివెంటే పరిగెత్తుతున్నారు.అదీ కలికాలం అంటే !


1, జనవరి 2013, మంగళవారం

నూతన ఆంగ్ల సంవత్సరంలో చిన్న కోర్కెలు కోరుకుంటూ ......

అందరికి నూతన ఆంగ్ల సంవత్సర  శుభాకాంక్షలు .


  • ఉన్న వాడికి లేని వాడికి చట్టం సమానంగా పనిచేయాలని
  • పోలీసు స్టేషన్ కు వెళ్ళినప్పుడు బాధితుని ఫిర్యాదును నిందితుని  హోదాను పరిశీలించిన తర్వాత మాత్రమే  స్వీకరించే పని చేయ  కుండా ఉండాలని
  • ఒక సారి రాజకీయాల్లోకి కాని అధికారంలోకి కాని వస్తే చిన్న పదవి నుండి ,పెద్ద పదవి వరకు ఉన్న వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరగ కుండా  ఉండాలని
  •  రాజకీయ నాయకులు  ప్రజల సొమ్మును ఎవరికి అవకాశం  ఉన్నంత వాళ్ళు  తిన్న తర్వాత నీవు ఎక్కువ తిన్నావు ,నీవు ఎక్కువ తిన్నావని విమర్శలు చేసుకోకుండా కొంచం ప్రజల గురించి ఆలోచన చేయాలని 
  • ప్రజల నుండి పన్నులు వసూలు చేసిన తర్వాత  ప్రజలకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత   తమదే అని ప్రభుత్వాలు గుర్తించాలని
  • బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి ,మూత్ర విసర్జన ,పొగ త్రాగడం చేయ వద్దనే ముందు ఉమ్మి తొట్లు ,మూత్రశాలలు ,పొగ త్రాగే రూములు పెట్టినామా అని ఆలోచన చేసి తర్వాత ప్రజలకు  చట్టాలను  గౌరవించాలని చెప్పాలని
  • ప్రజలను సోమరిపోతులను చేసే పథకాలను ప్రవేశ పెట్టవద్దని 
  • ప్రతిభను గౌరవించాలని 
  • వ్యవసాయదారులను గౌరవించాలని  
  • ప్రజలందరూ బాధ్యత గా మెలగాలని 
  • అవకాశం చిక్కినప్పుడల్లా తెలుగు వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలని  
  • అన్ని వ్యవస్థలు వీలైనంత సక్రమంగా పని చేయాలని
  • తమ అభిప్రాయాలను ప్రజలు స్వేచ్చగా వెల్లడించే అవకాశం ఉండాలని  కోరుకుంటూ......