మన పల్లెటూర్లలో రజక వృత్తి చేసే వాళ్ళ పని చాలా అద్బుతంగా ఉంటుంది.ఎందుకంటే వాళ్ళు చాలా మందివి, చాలా ఊర్లవి బట్టలు ఉతుకుతూ ఉంటారు.వాళ్ళు చాలా మటుకు నిరక్షరాస్యులు.అయినా కానీ ఒకరి బట్ట ఒకరికి మారకుండా తీసుక వచ్చి అప్పగిస్తుంటారు.పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కళాశాలల్లో చెప్పే సిక్స్ సిగ్మా స్టాండర్డ్స్ గురించి వారికేమీ తెలవదు.అయినా కానీ వాళ్లకు పుట్టుకతో అబ్బిన విద్య వలన వాళ్ళ పనులలో వాళ్ళు చాలా అద్బుతంగా రానిస్తుటారు.వీరిని చూస్తే మన గొప్ప గొప్ప మానేజ్మెంట్ గురులు ఏమంటారో.
3, నవంబర్ 2011, గురువారం
2, నవంబర్ 2011, బుధవారం
కళ్ళు బైర్లు కమ్మే ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు.
నేను ఈ రోజు మా అమ్మాయిని ప్రస్తుతం చదువుతున్న స్కూలు నుండి వేరే స్కూల్లో చేర్పిస్తామని విచారించడానికి వెళ్లి ఫీజు గురించి అడిగితే ఐదంకెల ఫీజు చెప్పారు.అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.ఎందుకు అంత ఫీజు అడుగుతున్నారని అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు మేము తీసుకుంటున్నాము అని వాళ్ళ సమాధానం.నేను ఏమీ ఖర్చు లేకుండా ప్రభుత్వ స్కూల్లో చదివాను.కానీ ఈ వాళ పరిస్థితి మధ్య తరగతి మానవునికి చాలా ఇబ్బంది గా తయారైంది.ఈ మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళతోనే ఈ పరిస్థితి.వీళ్ళు డబ్బు ఎంత ఎక్కువ కడితే అంత బాగా చదువు చెబుతారనే భ్రమలో ఉన్నారు.ఒక వేల స్కూలు యాజమాన్యాలు తక్కువ ఫీజు తీసుకుంటే వీళ్ళకు రుచించదు.దాని కోసమే స్కూలు యాజమాన్యాలు ఫీజు పెంచిన సందర్భాలు ఉన్నాయి.ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళ ను నాశనం చేసారు.అలా అని ఈ ప్రైవేట్ స్కూళ్ళు అంత బాగా ఏమీ చెప్పడం లేదు.తిరిగి పిల్లలతో పాటు మనము కుస్తీ పట్టాలి.మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ఎలా చదివించు కోవాలో అర్థం కావడం లేదు.ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుకు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.లేకపొతే సామాన్య ప్రజలు స్కూలు వైపు వెళ్ళే పరిస్థితి ఉండదు.
22, సెప్టెంబర్ 2011, గురువారం
ఎవరికోసం రూపాయికి కిలో బియ్యం ?
ఒక రూపాయకే కిలో బియ్యం అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.కానీ క్షేత్ర స్థాయిలో ఆ బియ్యం మెజారిటీ లబ్దిదారులు ఆ రేషన్ బియ్యం మేము తినడం లేదు ,మేము సన్న బియ్యం కొనుక్కుంటున్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నారు.రేషన్ బియ్యాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు.ఆ బియ్యం రీసైకిల్ అయ్యి వాటిని సిటీ లోపట్టణాలలో ఉండే ప్రజలు కిలో ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారు ,.కావున ఈ పథకం చాలా దుర్వినియోగం అవుతున్నది.నిజమైన అవసరమైన లబ్దిదారులకు మాత్రమే అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలి.
16, సెప్టెంబర్ 2011, శుక్రవారం
మీడియా అత్యుత్సాహం !
ఈ రోజు ఉదయం నుండి ఒక చానల్ అంబటి గురించి అదే పనిగా ప్రసారం చేస్తుంది.దేశం లో ఎన్నో సమస్యలు ఉండగా అంబటి విషయమే దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన విషయం అన్నట్లు అతి విలువైన మీడియా కాలాన్ని వృధా చేస్తున్నారు.అంబటి అనే మనిషి ఒక వ్యక్తి మాత్రమే,అతను ఏ విధమైన రాజ్యాంగ పదవులలో లేడు.అతను ఒక వేళ తప్పు చేసి ఉన్నట్లయితే ఇబ్బందులకు గురైన వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది.అలా కాకుండా చానల్ అదే పనిగా ఈ విషయాన్నే ఉదయం నుండి చర్చను కొనసాగిస్తా ఉంటే భాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం కాకుండా ఇంకేదో ఉద్దేశ్యం ఉన్నట్లు చూసే వాళ్లకు అనిపిస్తుంది.ఇప్పటికే మీడియా వాళ్లకు రకరకాల రాజకీయాలు అంటకట్టబడిఉన్నాయి.వాటిని నిజం చేయాలని చూడకూడదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

