ఏదో ప్రజలను ఉద్దరిస్తానని సినిమా డైలాగులు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన చిరంజీవిని ఆంధ్ర ప్రదేశ్ తెలివైన ప్రజలు ఆయన్ను పద్దెనిమిది సీట్లకు మాత్రం పరిమితం చేసారు.ఆయనతో పాటు ఉన్న మేధావులంతా ఈయన వ్యవహారం నచ్చక ఎప్పుడో వెళ్లి పోయారు.ఆయన వ్యక్తిత్వాన్ని మన రాష్ట్ర ప్రజలు చాలా బాగా అంచనా వేసారు.అందుకే అధికారానికి దూరంగా పెట్టినారు.ఆయన కు పార్టీ భారంగా పరిణమించింది.ఎప్పుడె పుడు కాంగ్రెస్ లో విలీనం చేయాలని మునిగాళ్ళ మీద నిలబడి ఉన్నాడు.వాళ్ళు అడిగినా అడగక పోయినా మద్దత్తు ఇస్తానని చెబుతున్నాడు.ఈయన మన రాష్ట్రం లో ఇంకొక విశ్వసనీయత లేని నాయకుడిగా మిగిలి పోయారు.చివరకి భారాన్ని దింపుకుంటున్నారు .తమ స్వార్థ ప్రయోజనాల కోసం దినం ఒక మాట మాట్లాడే ఇటువంటి అవకాశవాదులని ప్రజలు జాగ్రత్తగా గమనించి అవకాశం వచ్చినపుడు తగిన బుద్ది చెబుతారు.
1, ఫిబ్రవరి 2011, మంగళవారం
29, జనవరి 2011, శనివారం
జగన్ రాజశేఖరరెడ్డి గారి లాగే చరిత్ర సృష్టిస్తాడు.
చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది.ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖరరెడ్డి గారి కి ఉన్న జనాదరణ ను చూసి కొన్ని మీడియా సంస్థలు ,కొన్ని పార్టీల పెద్దలు ఆయన్ను ఫ్యాక్షనిస్టు అని రాష్ట్రం లో ఏం జరిగినా ఆయనకే ఆపాదిస్తూ ఆయన్ను ప్రజల మనస్సులలో నుండి దూరం చేయాలని నానా ప్రయత్నాలు చేసినా , ఎవరెన్ని కుట్రలు పన్నినా ఒక ధీరుని వలె ఒంటి చేత్తో పార్టీ ని అధికారంలోకి తీసుకొని వచ్చి ప్రజారంజకంగా పరిపాలన సాగించి ప్రజల మనస్సులలో ఒక దేవుని వలె నిలిచి పోయినాడు.ఆయన ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు,ఏ మీడియా సంస్థలకు వంగి వంగి సలాములు చేసి తమకు అనుకూలంగా ప్రచారం చేసికొని పరిపాలన సాగించ లేదు.ప్రత్యర్థులు సైతం పొగిడే విధంగా పరిపాలన సాగించారు.ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన మీడియా సంస్థల ,మరియు ప్రతిపక్ష నేతల మరియు అధికార పక్షం లోని ఆయన వ్యతిరేకుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం లో పడేసారు.
ఈ వాళ జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఆయన్ను అడ్డుకోవడానికి అన్ని పార్టీ లు చాలా మీడియా సంస్థలు ఏకం అయ్యాయి.కొన్ని మీడియా ల లో ప్రశ్నార్థక చిహ్నం(?) పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేసిందే చేస్తున్నారు.ఇలా చేసి వాళ్ళ విశ్వసనీయత ను పోగొట్టుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని పార్టీలు ఇలా విష ప్రచారం చేసి ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని నవ్వుల పాలయ్యాయి.ఇలా ఎన్ని చేసినా ప్రజల మనస్సులలో నుండి రాజశేఖర రెడ్డి గారిని మరియు జగన్ ను తీసి వేయలేరు.ఎప్పటికైనా వాళ్ళ నాన్న గారి లాగే జగన్ కూడా ఇవన్నీ చేదించుకొని బయట పడి అధికారం లోకి వచ్చి చరిత్ర సృష్టిస్తాడు.
ఈ వాళ జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఆయన్ను అడ్డుకోవడానికి అన్ని పార్టీ లు చాలా మీడియా సంస్థలు ఏకం అయ్యాయి.కొన్ని మీడియా ల లో ప్రశ్నార్థక చిహ్నం(?) పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేసిందే చేస్తున్నారు.ఇలా చేసి వాళ్ళ విశ్వసనీయత ను పోగొట్టుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని పార్టీలు ఇలా విష ప్రచారం చేసి ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని నవ్వుల పాలయ్యాయి.ఇలా ఎన్ని చేసినా ప్రజల మనస్సులలో నుండి రాజశేఖర రెడ్డి గారిని మరియు జగన్ ను తీసి వేయలేరు.ఎప్పటికైనా వాళ్ళ నాన్న గారి లాగే జగన్ కూడా ఇవన్నీ చేదించుకొని బయట పడి అధికారం లోకి వచ్చి చరిత్ర సృష్టిస్తాడు.
1, జనవరి 2011, శనివారం
16, డిసెంబర్ 2010, గురువారం
ఇప్పుడున్నది వ్యవస్థలను గౌరవించే నాగరిక సమాజమేనా?
ఊర్లలో పొలాల కోసం కావలి వాండ్లు ఉండే వారు.ఇప్పటికీ కూడా ఈ పద్దతి చాలా ఊర్లలో ఉంది.ఊరి పంచాయితీ మరియు పెద్దమనుషులు కలిసి వాళ్ళను పెట్టే వారు.చాలా సందర్భాలలో ఈ కావలి వాండ్లు దళిత కులాలకు చెందిన వారే ఉండే వారు.వాళ్ళు ఊరి మొదట్లో ఒక కర్ర చేత బట్టుకొని ఉండే వారు.ఊర్లోని వాళ్ళు ఎవరైనా సరే పంటల సమయం లో పొలాల్లో నుండి కోసుకు రాకుండా ఉండడానికి వీళ్ళను పెట్టే వారు (పంటలు కోసే సమయం లో తప్ప ).దీనివలన ఇతరుల పంటలను దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉండేది.ఒక వేళ ఆ సమయంలో ఎవరైనా పంటను తీసుక వస్తే వాళ్లకు జుర్మానా విధించి ఆ డబ్బును పంచాయితీకి జమ చేసేవాళ్ళు.వీళ్ళను చూస్తే ఎవరికైనా భయం ఉండేది.నూరు ఎకరాల ఆసామి అయినా వాళ్లకు భయపడే వాడు.పెద్దగా చదువుకోని పల్లెటూరి సమాజాలల్లో కూడా వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల పట్ల అంత గౌరవం ఉండేది.కానీ నేడు బాగా చదువుకున్న నాగరిక సమాజం(?) లో కూడా వ్యవస్థలకు విలువ లేకుండా పోయింది.పోలీసులు చివరికి ముఖ్యమంత్రి ,ప్రధాన మంత్రి వంటి ప్రధాన మైన వ్యవస్థలకు కూడా విలువ ఇవ్వడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

