21, నవంబర్ 2010, ఆదివారం

జగన్ ఎవరి వాడు?

జగన్ మీడియాలో కాంగ్రెస్స్ పార్టీ గురించి మరియు సోనియా గారి గురించి వచ్చిన వార్తా కథనాన్ని చూసి కాంగ్రెస్స్ పార్టీ వీరాభిమానులు(?) రెచ్చిపోయి ఖండనలు మరియు మీడియా ఆఫీసుల మీద దాడికి పాల్పడుతున్నారు.ఇంతకు ముందు ఒక పత్రికా యాజమాన్యం మీడియాను అడ్డుపెట్టుకొని చట్ట వ్యతిరేకమైన ఆర్ధిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటే మీడియా మీద దాడి అని ప్రతి ఒక్కరూ గగ్గోలు పెట్టారు,కానీ నేడు ప్రజాస్వామిక వాదులు సాక్షి మీద దాడి జరుగుతూ ఉంటే నోరు మెదపడం లేదు.ఎక్కడ దాక్కున్నారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అవాకులు చెవాకులు పేలిన కాంగ్రెస్స్ నాయకులకు తెలీదా, ఆయన కూడా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నాయకుడని.జగన్ ఓదార్పు యాత్ర చేస్తుంటే దానికి లెక్కలేనన్ని అడ్డంకులు కల్పించారు.అప్పుడు తెలీదా జగన్ పార్టీకి చెందిన వ్యక్తో? ఓదార్పు యాత్రను సమర్థిస్తున్నారన్న ఏకైక కారణంతో ఎందరో నిజమైన కాంగ్రెస్స్ కార్య కర్తలను పార్టీ నుండి వెలివేశారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన అభిమానులని కాంగ్రెస్స్ దగ్గరకు తీసుకో లేదు సరి కదా వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసింది. వాళ సాక్షి మీడియాలో ఏదో వార్త వచ్చిందని, కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు నానా యాగీ చేస్తున్నారు.రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ను మరియి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని తమ పార్టీ వాళ్ళే అని,కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తించారా ?

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఎ.పి.పి.ఎస్.సి పరీక్షలు రాయలేని విద్యార్థుల బాధలకు భాధ్యులు ఎవరు?

తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడ కుండా తప్పించుకోవడానికి టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు నానా రభస చేసి .పి.పి.ఎస్.సి. నిర్వహించే పరీక్షలను తెర పైకి తెచ్చి అడ్డుకుని చాలా మంది కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు. వాళ నష్టపోయిన విద్యార్థుల గురించి ఎవరూ మాట్లాడడం లేదు.టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు .పి.పి.ఎస్.సి. పరీక్షలను తెర మీదికి తెచ్చి తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడకుండా తప్పుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారు.కాని అమాయక విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు.ఇప్పటికైనా తెలంగాణా విద్యార్థులు భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మసలుకోవాలి.

4, సెప్టెంబర్ 2010, శనివారం

తెలంగాణా ప్రజలు తిరిగి కే.సి.ఆర్ ఉచ్చులో పడ్డారు.

సెప్టెంబర్ 17 తేదిని తెలంగాణా విమోచన దినం జరపాలని అన్ని పార్టీ నుండి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ,టి.ఆర్.ఎస్ పార్టీ కూడా చిన్నగా డిమాండ్ చేసింది.కానీ టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్లకు ముఖ్యంగా కే.సి.ఆర్ కు విమోచన దినం డిమాండ్ చేసి ముస్లిం ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు ,అలాగని తెలంగాణా పరుగులో వెనక పడ్డం ఇష్టం లేదు .అందుకే వ్యూహాత్మకంగా .పి.పి.ఎస్.సి నిర్వహించే గ్రూప్ -1 పరీక్షలను ముందుకు తెచ్చి తెలంగాణా వాళ్ళను ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టి తను అనుకున్నది సాధించారు.ఇప్పుడు అందరూ .పి.పి.ఎస్.సి నిర్వహించే పరీక్షల వెంట పడ్డారు.విమోచన దినం గురించి అందరూ మర్చి పోయారు.రాజకీయ నాయకుల స్వార్థ వ్యూహాలు వాళ్లకు ఉంటాయి.విద్యార్థులు స్వార్థ రాజకీయనాయకుల ఉచ్చులో పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

2, సెప్టెంబర్ 2010, గురువారం

పేదల పక్షపాతి కి అశ్రునివాళులు

పేదల పక్షపాతి ,విశ్వనీయతకు మారు పేరైన రాజశేఖర రెడ్డి గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటూ .....