మనం ఎవరింటికైనా వెళ్తా వుంటే ,మనం వాళ్ళింటికి వెళ్ళడం వాళ్లకు ఇష్టం లేక పొతే వాళ్ళు చెప్పాలి వాళ్ళింటికి రావద్దని,కానీ పక్కింటివాడు చెప్పద్దు వాళ్ళింటికి పోవద్దని.ఇదేం న్యాయమో అర్థం కావడం లేదు , మరణించిన కుటుంబాలను పరామర్శించ డానికి జగన్ పోతా ఉంటే టి.ఆర్.ఎస్ వాళ్ళు అడ్డుకోవడం ,హింస సృష్టించడం ఏ ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చేసారో అర్థం కావడం లేదు.టి.ఆర్.ఎస్ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన చనిపోయిన తెలంగాణా వాదులను ఒక రోజు కూడా పరామర్శించి ,ఆర్ధిక సాయం చేయని వీళ్ళు జగన్ మాత్రం కుటుంబాలను ఒక చోట చేర్చి ఆర్ధిక సాయం చేయాలని ,పరామర్శకు వెళ్ళవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. టి.ఆర్.ఎస్ వాళ్ళు చెప్పిన టైము లో పరామర్శకు వెళ్ళాలంట,వాళ్ళు చెప్పిన విధంగా ఆర్ధిక సాయం చేయాలంట ,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు పయనిస్తుంది,ఆటవిక సమాజంలోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారా? టి.ఆర్.ఎస్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పేలుతుంటే రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు,మేధావి వర్గాలు ఏం చేస్తున్నట్లు. ప్రత్యేక తెలంగాణా కావాలని కోరిన వాళ్ళు ఈ వాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చలామణి అవుతున్నారు,ఇది ఏ విధంగా నైతికతో అర్థం కావడం లేదు.ప్రత్యేక వాదం మాట్లాడే వాళ్లకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మంత్రులుగా పనిచేసే అర్హత లేదు.వాళ్ళు మంత్రిపదవులకు రాజీనామా చేసిన తరవాత మాత్రమే ప్రత్యేక వాదం గురించి మాట్లాడాలి.
29, మే 2010, శనివారం
18, మే 2010, మంగళవారం
కే.సి.ఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే విజయవాడ పర్యటన చేయాలి.
సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ప్రజలను దోచుకున్నారని ,సీమాంధ్ర ప్రజలు దోపిడిదారులని ఇన్ని రోజులు విష ప్రచారం చేసి , సీమాంధ్ర ప్రజల మనసులను గాయ పరిచిన కే.సి.ఆర్ విజయవాడ పర్యటనకు వెళ్లేముందు సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పర్యటనచేయాలి.సమైక్యాంధ్ర ఉద్యమ కారులు ,నాయకులు కే.సి.ఆర్ క్షమాపణకు పట్టుపట్టాలి.
17, ఏప్రిల్ 2010, శనివారం
కే.సి.ఆర్ గారు ఓదార్పు యాత్ర చేయరా?
రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత భాధతో మరణించిన వ్యక్తుల కుటుంబాలను ప్రాంతాలకతీతంగా పరామర్శిస్తూ ,వీలైనంత ఆర్ధిక సాయం ప్రకటిస్తున్న జగన్ గారిని కే.సి.ఆర్ మరియు ఆయన పార్టీ వాళ్ళు అభినందించాల్సి పోయి విమర్శించడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది.కే.సి.ఆర్ మరియు టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన తెలంగాణా లోని అమాయక ప్రజలు కొంత మంది ప్రాణ త్యాగం చేసినారు.తెలంగాణా కోసం అమరులైనారని పదేపదే చెప్పుకొని శవ రాజకీయాలు చేస్తున్న టి.ఆర్.ఎస్ వాళ్ళు ఆ కుటుంబాలను ఒకసారైనా పరామర్శించి,వాళ్లకు ఏమైనా ఆర్ధిక సాయం చేశారా?ఈ విషయం చూస్తే తెలుస్తుంది,టి.ఆర్.ఎస్ వాళ్లకు తెలంగాణా ప్రజల మీద ఉన్నప్రేమ.తెలంగాణా ప్రజల మేలు కోసమే తెలంగాణా రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పుకుంటున్న టి.ఆర్.ఎస్ .పార్టీ కి పదవుల మీద ఉన్న ఆసక్తి తెలంగాణా ప్రజల మీద లేనట్లుంది. ఇటువంటి వాళ్ళ వలన వచ్చిన తెలంగాణా(ఒక వేళ వస్తే) ఏ విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో తెలంగాణా ప్రజలు ఒక సారి ఆలోచన చేయాలి.
3, ఏప్రిల్ 2010, శనివారం
ఏ తెలంగాణా రాష్ట్రం కావాలి?
ప్రత్యేక తెలంగాణా కావాలనుకునే వారిని ఒకటి అడగాలనుకుంటున్నాను,వాళ్లకు కావలసిన తెలంగాణా ఇప్పుడు మూడు రాష్ట్రాల దగ్గర ఉన్నది.మహారాష్ట్ర దగ్గర,కర్నాటక దగ్గర ,ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నది.వాళ్లకు ఏ తెలంగాణా కావాలనో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఉండేది,తెలుగు మాట్లాడే ప్రజలు ఉండే భాషా ప్రయుక్త రాష్ట్రం.భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు ఉండే తెలంగాణా వాళ్లకు కావాలనుకుంటే మూడు రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

