1, జూన్ 2009, సోమవారం
ఆధునిక వెట్టిచాకిరి
30, మే 2009, శనివారం
బాబు గారి మరియు చిరంజీవి గారి విస్లేసన
చందబాబు గారు మరియు చిరంజీవి గారు ఇప్పటికి మారలేదు.ఓటమిని నిష్పక్షపాతంగా విస్లేసించలేకున్నారు.ఒకాయనేమో యి.వి.యం ల వలన ఓడిపోయినామంటున్నారు.ఇంకొక ఆయనేమో ప్రధానమంత్రి పథకాల వలన ఆయన ఓడిపోయినామని అంటున్నాడు.చిరంజీవి గారు మార్పు అంటూ వచ్చి చాలా మంది పాతకాపులకే టికెట్లు ఇచ్చి ,మూస రాజకీయాలు నడిపినాడు.అందువల్లనే ఆయనను కూడా ప్రజలు మిగతా పార్టీ ల గాటనే కట్టేశారు.ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని నిష్పక్షపాతంగా విస్లేసించుకొని చేసే పనులు మార్చు కుంటే ప్రజల ఆదరణ పొందుతారు,లేకుంటే చరిత్రలో కలసిపోతారు.
18, మే 2009, సోమవారం
సూడో సెక్యులరిజం
నిజామాబాదు లో పి.సి.సి. అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఓటమి సూడో లౌకికవాదులకు ఒక కను విప్పు కావాలి."మైనారిటీల మీదకి చేయి చూపిస్తే ఆ చెయ్యి ఉండదని ",మైనారిటీ లు ఉన్న సభలో మాట్లాడుతూ అన్నట్లు పత్రికలలో వార్తలు వచ్చినాయి.అది చూసి హిందువులంతా బి.జే.పి అభ్యర్థికి గంపగుత్తగా ఓట్లు వేసి శ్రీనివాస్ గారిని ఓడించినట్లున్నారు. ఈ వాళ దేశం లో కాంగ్రెస్,సమాజ్ వాదీ,ఆర్.జే.డి. లాంటి పార్టీ లు సూడో లౌకికవాద రాజకీయాలు నడిపినారు కాబట్టే ,బి.జే.పి లాంటి మతతత్వ పార్టీ లు బలం పుంజుకున్నాయి. మోడి లాంటి నాయకులు బలపడడానికి అవకాశం ఏర్పడింది.భిన్న మతాలు,కులాలు,సంస్క్రతులు ఉన్న దేశంలో పార్టీలు,నాయకులు సూడో లౌకిక వాదాన్ని వదిలి పెట్టి నిజమైన లౌకిక వాదులుగా మారితే ప్రజలకు,దేశానికి మంచిది.
16, మే 2009, శనివారం
జయహో ఓటరు మహాశయా!
ఈ ఎన్నికలలో దేశ ప్రజలు ,ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చినారు.ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు.
- ముఖ్యంగా చంద్రబాబు గారి మోసపూరితమైన హామీలను నమ్మలేదు.అన్ని పార్టీలను కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రజాసేవ కంటే అధికారమే పరమావధి గా పని చేసినారు.ఆయన విశ్వసనీయతను , చిత్తశుద్ది ని ప్రజలు ఎవరూ నమ్మలేదు."ముఖ్యంగా నాయకులు విశ్వసనీయత,చిత్తశుద్ది ఒక సారి కోల్పోతే ప్రజలు వారిని నమ్మరని తేలిపోయింది."
- సామాజిక న్యాయం అంటూ వచ్చి రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న ఇంకొక ఆయనను చిత్తుగా ఓడించినారు. ముఖ్యంగా మార్పు అంటూ వచ్చిన ఆయన లోకసత్తా లాగా నిజాయితీ పరులకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేదేమో.ఈయన కూడా అధికార పేఠమే పరమావధిగా ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినాడు.సభలకు వచ్చిన ప్రజలను చూసి అదంతా తన బలుపు అనుకొని ఆయన గాల్లో తేలిపోయినాడు.చివరికి అది వాపు అని తేలిపోయింది.చివరకు పాలకొల్లులో ఒక మామూలు మహిళ చేతిలో మెగాస్టార్ తలవంచ వలసింది. ఓట్ల కంటే ముందే ముఖ్యమైన నాయకుల ను కోల్పోయిన ప్రజారాజ్యం పార్టీ ,ఈ వాళ ఓట్లలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ,పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోయింది."ఈ వాళ ప్రజారాజ్యం తరుపున గెలిచిన వాళ్లు కూడా తమ సత్తాతో గెలిచిన వాళ్ళే,చిరంజీవి చరిష్మా ఏమీ పని చేయలేదని తేలిపోయింది."
- కమ్యూనిస్టులు అధికారాన్ని ఆశిమ్చ కుండా ప్రజా ఉద్యమాలను నిర్మించి నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వాలకు చేస్తూ ,ప్రతిదినమూ ఒక పార్టీ తో అధికారంకోసం జట్టు కట్టేది మానుకొని వాళ్లు స్వంతం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి.విశ్వసనీయత లేని పార్టీలతో వీళ్ళు జట్టు కడితే వీళ్ళ విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది.
- సినిమా వాళ్లు కూడా ,వాళ్ల గురించి వాళ్లు ఎక్కువగా ఊహించు కునేది మానుకోవాలి.నిన్న గాక మొన్న సినిమాలలోకి వచ్చి రెండు మూడు సినిమాలు విజయవంతమైన హీరోలందరూ కూడా ,ప్రజలు వీళ్ళు ఏది చెపితే అది వినే వెర్రి వాళ్లు అనుకొని జనాన్ని చూస్తూనే పూనకం వచ్చిన వాళ్ళలా ఇష్టమొచ్చిన డైలాగులు చెప్పి ,తొడలు కొట్టి ,మీసాలు తిప్పి నానా హంగామా చేసినారు.ప్రజా సేవ అంటే మూడు గంటల సినిమా కాదని ప్రజలు తేల్చేసారు.
- చివరగా కాంగ్రెస్స్ పార్టీ కి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని ,ఓటరు తీర్పు ఇచ్చినాడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చేత్తప్పుడు ఆ భూమి కోల్పోయే పేద రైతు ల కడుపు మంటను గుర్తు పెట్టుకొని పని చేయాలని ,ప్రభుత్వ పతకాలను ప్రజలందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరవేయాలని,ఊర్లలో ఉండే చోటా లీడర్లను అదుపులో పెట్టుకొని ప్రజలకు ప్రభుత్వ పతకాలు నేరుగా అవినీతి లేకుండా చేరవేస్తే తిరిగి అయిదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్స్ వాళ్ళదే అవుతుంది.
- ఒకసారి ఎన్నికవగానే సేవకులనే మాట మరిచిపోయి ప్రభువులమని అనుకుని ప్రజాసేవపట్టని నాయకులను ,మంత్రులను ఓడించి,ఓటరు వారికి ఒక మంచి గుణపాఠం చెప్పినాడు.
- లోకసత్తా నాయకుని గెలిపించి ప్రజలు తమకు మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని ,అవినీతి రహిత సమాజం కావాలని ,ప్రజాస్వామ్య పునాదులు ఇంకా గట్టి పదాలని,ఓట్లను డబ్బు తో కొనే విధానం పోవాలని చాలా బలంగా ,గట్టిగా కోరుకున్నారు.