17, నవంబర్ 2014, సోమవారం

రాజధాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెరట్లో నే ఉండాలి..

           ఒక వైపు రాజధాని తుళ్లూరు ప్రాంతం వైపు అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అక్కడ రైతుల భూముల ధరలు విపరీతంగా పెరిగాయని వార్తలు వస్తున్నాయి. మరో వైపు అక్కడ కొంత మంది రైతులు మూడు నాలుగు పంటలు పండే పచ్హని తమ భూములు ఇవ్వమని చెబుతూనే ,రాజధాని అమరావతి,తాడికొండ మండలాల్లో పెట్ట వచ్హుకదా అని చెబుతున్నారు. కానీ రాజధానిని తీసుకొని పోయి ప్రభుత్వ బీడు భూములు ఉన్న చోట పెట్టమని చెప్పడం లేదు.అంటే రాజధాని మాత్రం తమ పెరట్లోనే ఉండాలి కానీ తమ భూముల్లో ఉండకూడదు.
             ఒకప్పుడు వేరుశనగ పంట విపరీతంగా పండే అనంతపురం జిల్లా లోని కదిరి ప్రాంతం లో ,ఇప్పుడు వర్షాలు లేక వేల ఎకరాలు భూముులు బీడు పడి ఉన్నాయి.ఇప్పటికీ అక్కడ ఎకరా భూమి 30000 రూపాయలు ధర కూడా పలకని ప్రాంతాలు ఉన్నాయి.
             ఇటువంటి ప్రాంతం లో రాజధాని పెడితే అక్కడ భూములకు కొంచ మైనా గిరాకీ వచ్హి రైతులు బాగు పడతారు. ఇన్ని రోజులూ ఆంధ్ర ప్రాంతం వాల్లకు నీరు ఇచ్హి రెండు మూడు పంటలు పండే లా చేసి వాల్లను ఆర్థికంగా బలపడేటట్లుగా చేసారు.ఇప్పుడు మల్లీ రాజధానిని తీసుకు వెళ్ళి అక్కడే పెట్టి తిరిగి వాల్లనే బలవంతులను చేస్తున్నారు.
           ఆర్థికాభివృద్దిని ఒకే వైపు కేంద్రీకరిస్తున్నారు.రాయలసీమ వాల్లు కూడా ఈ రాష్ట్రం లోని ప్రజలే అని ప్రభుత్వాలు ,అక్కడి ప్రజలు గుర్తిస్తే బాగుంటుంది.

11, నవంబర్ 2014, మంగళవారం

స్వచ్చ భారత్ ...

ఈ స్వచ్హ భారత్ లో పాల్గొంటున్న వారు వేసుకున్న హ్యాండ్ గ్లౌసులు ,మూతికి కట్టుకునే గుడ్డలు ,మంచి చీపుర్లు మరియు ఈ ప్రొగ్రాం లో పాల్గొనడానికి వచ్హే ముందు వేయొంచు కున్న ఇంజెక్షన్లు ,తీసుకున్న జాగ్రత్తలలో కొంత శాతమైనా ప్రతి రోజూ ఈ స్వచ్హ భారత్ లో ఫోటో లు లేకుండా ,శ్రమించే పారిశుద్ద కార్మికుల కోసం కేటాయిస్తే చాలాసంతోషం.