28, జులై 2014, సోమవారం

మీ సాయం అక్కరలేదు ...

"ఋణమాఫీ కి మా సాయం ఉండదు "----వెంకయ్య నాయుడు . 


"సార్  అంధ్రప్రదేశ్ కు మీ సాయం అక్కరలేదు ,ఎందుకంటే ఇక్కడ ఋణమాఫీ అయిపోయింది ,ఋణమాఫీ పొందిన ప్రజలు ఆనందం లో సన్మానాలు కూడా  చేస్తున్నారు ." 


కావాలంటే తెలంగాణా కు మీ సాయం ఏమైనా అవసరమేమో కనుక్కోండి .         

26, జులై 2014, శనివారం

అధికారం కోసం ..అభివృద్ధి ఆమడ దూరం .....

15000 కోట్ల లోటు తో విడి పోయిన తర్వాత మన పరిస్థితి తెలిసి కూడా  అధికారం కోసం అలవి గాని హామీలను గుప్పించడం దూరదృష్టి ,దార్శనికత ఉన్న నాయకులకు తగదు. అధికారం లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఏ  హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చారో  ఆ హామీలను నెర   వేర్చమని సహజంగానే ప్రతిపక్ష పార్టీలు  డిమాండ్ చేస్తాయి . అధికార ,ప్రతిపక్షాలు ఈ హామీల పైనే రాజకీయపు  ఎత్తులు పై ఎత్తులు వేయడం తో సరి పోతుంది .అభివృద్ధి పైన ఆలోచనలు వెల్లవు.  విడిపోయి కొన్ని సంవత్సరాలు వెనుక పడి పోతే ,ఈ రాజకీయాలలో మరి కొన్ని సంవత్సరాలు వెనక్కి పోతుంది . ఎ.పి . విడిపోయిన తర్వాత 15000 కోట్ల రూపాయల లోటు మరియు రాజధాని లేమి ఉన్న పరిస్థితిలో అటువంటి హామీలను ఇచ్చి ఉండవలసింది కాదు. ఎ.పి అభివృద్దిలో అధికార పక్షం ,ప్రతిపక్షం చేతిలో చెయ్యి వేసుకొని పరస్పరం సహకరించుకుంటూ పని చేసుకోవలసిన  సందర్భం ,అవకాశం ఇప్పుడు తప్పిపోయినట్లే కనిపిస్తుంది .దార్శనికత ,దూరదృష్టి లేని నాయకులు ఉండడం అంధ్రప్రదేశ్  ప్రజలు చేసుకున్న దురదృష్టం .    

ఇంజనీర్ కావాలంటే అక్కడ మాత్రమే చదవాలి......

            ఇప్పటికే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వలన ,ప్రభుత్వ విద్యావ్యవస్థలు మూతపడే స్థాయికి వచ్చినాయి . తీరా ఈ కార్పొరేట్ విద్యావ్యవస్థ వలన ఏమైనా మెరుగు పడిందా అంటే అదీ లేదు. చాలా మంది పేదలు విద్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి.విద్యలో కూడా నాణ్యత లోపించింది .  
     
                    ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ లో మార్కులు చాలా మందికి 95 శాతానికి పైగా వస్తున్నాయి,ఇంకా కొన్ని సబ్జక్టుల్లో అయితే 100 శాతం వస్తున్నాయి. కానీ  EAMCET  విషయం లోకి వచ్చేసరికి ర్యాంకులు వేలల్లో ,లక్షల్లో వస్తున్నాయి.ఇదేం  చదువో అర్థం కావడం లేదు.  

                    ఇటువంటి పరిస్థితి ఉంటే ఇప్పడు ఏకంగా మంత్రి గారు ఇంజనీరింగు అడ్మిషన్లను ఇంటర్ మార్కుల ఆధారంగా చేయడానికి స్టడీ చేస్తున్నామనడం చాలా హాస్యాస్పదంగా ఉంది . ఇదే కనుక అమలు చేస్తే ఇంజనీరింగు కావాలంటే ఆ రెండు కార్పొరేట్ కాలేజీల లోనే చదవాలని పరోక్షంగా సూచించడమే! 




2, జులై 2014, బుధవారం

చంద్రబాబు గారు మాట నిలబెట్టుకునేటట్లు గానే కనిపిస్తున్నారు !

చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారం  లో భాగంగా "ఏం  తమ్ముడూ నీకు ఋణ  మాఫీ వద్దా "," ఏం  చెల్లెమ్మా నీకు డ్వాక్రా ఋణ  మాఫీ వద్దా " అని వేలు చూపిస్తూ అడిగినప్పుడు ,ప్రజలనుండి కావాలి..కావాలి .. అని కేకలు . ఆ ప్రచారం ఇప్పటికీ ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా గుర్తుకు వస్తూనే ఉంది . ఆయన మాటలు నమ్మి ప్రజలు ఎంతో ఆశతో ఓట్లు వేసి ఆయనను అధికారం లో కూర్చో బెట్టి ఇప్పటికి దగ్గర ,దగ్గరగా  నెల రోజులు అయ్యింది . కానీ ఋణ  మాఫీ గురించి  ఊసే లేదు ,మిగతా హామీల సంగతి దేవుడెరుగు! దీన్ని బట్టి  చూస్తే  చంద్రబాబు గారు "మాట తప్పడం లో " మాట నిలబెట్టుకునేటట్లు గానే కనిపిస్తున్నారు !   

1, జులై 2014, మంగళవారం

మీడియా మరియు వార్తా పత్రికలు ప్రజా పక్షం వహించి ప్రతి పక్ష పాత్ర పోషించాలి!

            మీడియా మరియు వార్తా పత్రికలు ప్రజా పక్షం వహించి ప్రతి పక్ష పాత్ర పోషించాలి. ఎందుకంటే ఎన్నికలలో వివిధ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మొట్టమొదటి హామీ వ్యవసాయ  ఋణమాఫీ  మీద రైతులు ఎదురు చూస్తున్నారు . ఇది ఆలస్యం చేస్తే ,ఒక వేల ఋణమాఫీ చేయక పోతే ఇప్పడు  ఖరీఫ్ కోసం కొత్త ఋణాలు  బ్యాంకులు ఇవ్వక పోగా ,ముందు తీసుకున్న ఋణాలకు వర్తించే సున్నా శాతం వడ్డీ కూడా  వర్తించదు .మొత్తం వడ్డీ కూడా  కట్ట వలసిన పరిస్థితి . ఇటువంటి క్లిష్ట సమయం లో నైనా పత్రికలు ,మీడియా ప్రజల వైపు ఉండి ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల తరుపున న్యాయం కోసం పోరాడాలి ,ఒక వేల ఈ సమయంలో కూడా పోరాడక పోతే మీడియా కు విశ్వసనీయత పోతుంది. పోరాడక పోతే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియా కు  అర్థమే ఉండదు .