19, ఏప్రిల్ 2014, శనివారం

నోటా బటన్ నొక్కిన తర్వాత?

చాలా  రాజకీయ పార్టీ లు నిలబెట్టే అభ్యర్తు ల  చరిత్ర  చూసినా ఏమున్నది గర్వకారణం,పాత రౌడినో లేక ఖూనికోరో లేక అక్రమ వ్యాపారాలవలన కోట్లు సంపాదించినవాడో కనిపిస్తున్నాడు.వీళ్ళకు వోట్లు వేయాలంటే వెగటు పుడుతుంది. కాబట్టి వోటింగ్ యంత్రం లో నోటా  బటన్ పెట్టినట్లున్నారు . నిల్చిన అభ్యర్థులెవరూ ఇష్ఠంలేని వాళ్లు ఆ బటన్ నొక్కుతారు. మొత్తం వోట్లు లెక్కించిన తర్వాత కొంత శాతం వోట్లు నోటా  బటనుకు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.ఆ ఇష్ఠం లేని అభ్యర్థులను కొన్ని సంవత్సరాలు ఎన్నికలలో పాల్గొనకుండా డిబార్ చేసి,ఆ ఎన్నికల ఖర్చును ఆ గుర్తింపు పొందిన పార్టీలనుండి వసూలు చేయాలి.ఇలా చేస్తే తర్వాత నుండి  ఆ పార్టీ లు వీలైనంత మంచి అభ్యర్ధు లను నిలబెడతారు. దీని మీద ఎన్నికల కమీషన్ దృష్టి  పెట్టాలి. 

16, ఏప్రిల్ 2014, బుధవారం

సామాన్య ప్రజలకు సింగపూర్ ఎలా ఉంటుందో ఏం తెలుసు ?

తమ పార్టీ ని గెలిపిస్తే సామాన్య ప్రజలకు ఏం  చేస్తామో చెప్పకుండా  ఆంధ్ర ని  సింగపూర్ చేస్తామని   హామీ లు ఇస్తున్నారు. అసలు  సింగపూర్ ఎలా ఉందో అక్కడ ఏముందో సామాన్య ప్రజలకు ఏం  తెలుసు. వాళ్ళు అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదుగా!కావున సింగపూర్ మాటలు కాకుండా తాము అధికారం లోకి వస్తే ఏం చేస్తామో చెబితే బాగుంటుంది . 

తెలంగాణా విధ్వంసం లో కె.సి.ఆర్ పాత్ర !

సీమాంధ్ర పాలనలో   తెలంగాణా  లో హిరోషిమా,నాగసాకి తరహాలో విధ్వంసం జరిగింది అంటున్న  కె.సి.ఆర్ ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలి. అదే సీమాంధ్ర పాలనలో తను కూడా  మంత్రిగా పని చేసారు. అధికారాన్ని అనుభవించారు . ఒక వేల ఆయన చెప్పినట్లు విధ్వంసం  జరిగి ఉంటే దానికి ఆయన కూడా  బాధ్యత వహించాలి . తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.