25, నవంబర్ 2011, శుక్రవారం

దయచేసి సమాధానాలు చెప్పగలరు.

1) వేగంగా వెళ్ళే బస్సు లో గానీ ఏదైనా వాహనం లో గానీ ఒక ఈగ గానీ ఒక కీటకం గానీ ఎగురుతూ ఒకే స్థానంలో ఉంటే కీటకం బస్సుకు కొట్టుకుంతుందా?కొట్టుకోదా ? కారణం ఏమి?

2) ఒక పంజరం లో ఒక పక్షి ని ఉంచి పక్షి పంజరం లో కూర్చున్నప్పుడు పంజరం తో సహా బరువును త్రాసులో తూచినప్పుడు , పక్షి అదే పంజరంలో కూర్చోకుండా ఎగురుతూ ఉన్నప్పుడు ఉన్న బరువు సమానంగా ఉంటాయా? ఎందుకు?

దయచేసి బ్లాగు మిత్రులు వివరంగా సమాధానాలు చెప్పగలరు.

3, నవంబర్ 2011, గురువారం

పెద్ద పెద్ద మానేజ్మెంట్ గురులు ఏమంటారో!

మన పల్లెటూర్లలో రజక వృత్తి చేసే వాళ్ళ పని చాలా అద్బుతంగా ఉంటుంది.ఎందుకంటే వాళ్ళు చాలా మందివి, చాలా ఊర్లవి బట్టలు ఉతుకుతూ ఉంటారు.వాళ్ళు చాలా మటుకు నిరక్షరాస్యులు.అయినా కానీ ఒకరి బట్ట ఒకరికి మారకుండా తీసుక వచ్చి అప్పగిస్తుంటారు.పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కళాశాలల్లో చెప్పే సిక్స్ సిగ్మా స్టాండర్డ్స్ గురించి వారికేమీ తెలవదు.అయినా కానీ వాళ్లకు పుట్టుకతో అబ్బిన విద్య వలన వాళ్ళ పనులలో వాళ్ళు చాలా అద్బుతంగా రానిస్తుటారు.వీరిని చూస్తే మన గొప్ప గొప్ప మానేజ్మెంట్ గురులు ఏమంటారో.

2, నవంబర్ 2011, బుధవారం

కళ్ళు బైర్లు కమ్మే ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు.

నేను రోజు మా అమ్మాయిని ప్రస్తుతం చదువుతున్న స్కూలు నుండి వేరే స్కూల్లో చేర్పిస్తామని విచారించడానికి వెళ్లి ఫీజు గురించి అడిగితే ఐదంకెల ఫీజు చెప్పారు.అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.ఎందుకు అంత ఫీజు అడుగుతున్నారని అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు మేము తీసుకుంటున్నాము అని వాళ్ళ సమాధానం.నేను ఏమీ ఖర్చు లేకుండా ప్రభుత్వ స్కూల్లో చదివాను.కానీ వాళ పరిస్థితి మధ్య తరగతి మానవునికి చాలా ఇబ్బంది గా తయారైంది. మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళతోనే పరిస్థితి.వీళ్ళు డబ్బు ఎంత ఎక్కువ కడితే అంత బాగా చదువు చెబుతారనే భ్రమలో ఉన్నారు.ఒక వేల స్కూలు యాజమాన్యాలు తక్కువ ఫీజు తీసుకుంటే వీళ్ళకు రుచించదు.దాని కోసమే స్కూలు యాజమాన్యాలు ఫీజు పెంచిన సందర్భాలు ఉన్నాయి.ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళ ను నాశనం చేసారు.అలా అని ప్రైవేట్ స్కూళ్ళు అంత బాగా ఏమీ చెప్పడం లేదు.తిరిగి పిల్లలతో పాటు మనము కుస్తీ పట్టాలి.మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ఎలా చదివించు కోవాలో అర్థం కావడం లేదు.ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుకు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.లేకపొతే సామాన్య ప్రజలు స్కూలు వైపు వెళ్ళే పరిస్థితి ఉండదు.