31, మే 2011, మంగళవారం

డబ్బుల కోసం ఏమైనా చేస్తారా?

మన రాష్ట్రంలో పేరున్న ఒక చానల్ ఇంకొక చానల్ యాజమాన్యానికి సంభంధించిన తలకు పెట్టుకునే ఆయుర్వేద మందు గురించి , మందు పనికి రానిదని ప్రజలను మోసం చేస్తున్నారని ఒక రోజంతా నిపుణులతో చానల్ లో చర్చా కార్యక్రమం పెట్టి మందు పనికి రానిదని తేల్చేసారు.కానీ అదే చానల్ కు సంభందించి పత్రికలో మాత్రం మందు కు సంభంధించిన ప్రకటన మొదటి పేజీ లో చూసి నేను ఆశ్చర్య పోయాను.ప్రకటనకు డబ్బులిస్తే ఏమైనా వేస్తారా ? ఇతరులకు నైతిక విలువలు భోదించే వరకేనా ?తమకు నైతికత అక్కరలేదా?ఇటువంటి వాటి వలెనే పత్రికలు విశ్వసనీయత కోల్పోయాయి.

14, మే 2011, శనివారం

మీసాలు తెగి పడ్డాయి,తొడలు బొబ్బలెక్కాయి.

మీసాలు తెగిపడ్డాయి.తొడలు బొబ్బలెక్కాయి.అధికార ,ప్రతిపక్షాలు కుమ్మక్కై ముప్పేట దాడి చేసినా వై.ఎస్.ఆర్ .కాంగ్రెస్స్ పార్టీ కడప ,పులివెందుల ఉప ఎన్నికలలో భారీ మెజార్టీ తో బోణీ కొట్టింది.జగన్ పేరుతో మరియు విజయమ్మ పేరుతో పదిమంది చేత నామినేషన్లు వేయించి, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వై.ఎస్.ఆర్. పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా బైండోవర్ కేసులు పెట్టించి ,విచ్చల విడిగా డబ్బులు పంచి ,గెలవడానికి అధికార పార్టీ చేయని కుట్ర అంటూ ఏమీ లేదు.అయినా కూడా కడప వోటర్లు వాళ్ళ ప్రలోభాలకు లొంగ కుండా విశ్వసనీయతలో రాజశేఖర రెడ్డి గారి వారసులమని మరోసారి చాటి చెప్పారు.అధికార ,ప్రతిపక్షాలు ఎన్ని మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతున్నా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది.అపజయాన్ని ఇప్పటికైనా హుందా గా ఒప్పుకుంటే ప్రజలు వాళ్ళను మన్నిస్తారు.

1, మే 2011, ఆదివారం

మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్లు....

మొన్న జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ,మరియు ఇప్పుడు జరుగుతున్న కడప,పులివెందుల ఉప ఎన్నికలల్లో ప్రచారానికి వెళ్ళిన బాలకృష్ణ,చిరంజీవి మరియు ఇప్పుడు నిల్చున్న తెలుగుదేశం అభ్యర్థి తొడగొట్టి ,మీసాలు తిప్పి తమ కున్న ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు.రాజశేఖర రెడ్డి గానీ,జగన్ గానీ ఎప్పుడూ తొడగొట్టి మీసాలు మెలేయలేదు.ఎవరు ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వాళ్ళో,దీన్ని బట్టి అర్థం అవుతున్నది, .కానీ తెలుగుదేశం నాయకులు మరియు ఇతర ప్రతిపక్షం వాళ్ళు రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఫ్యాక్షన్ కుటుంబంగా ముద్ర వేసి గోబెల్స్ ప్రచారం చేసారు.అందుకే ప్రజలు వీళ్ళ ప్రచారాన్ని ఎవరూ నమ్మకుండా వై.ఎస్. నాయకత్వాన్ని రెండు సార్లు బలపరిచారు.ఇది ఎలాగుందంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కి నట్లుంది.ఇప్పటికైనా ప్రతిపక్షం వాళ్ళు గోబెల్స్ ప్రచారం మానుకుంటే మంచిది.