26, ఫిబ్రవరి 2011, శనివారం

కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం అప్పలరాజు...

చాలా రోజుల తర్వాత వర్మ గారి సినిమా కు వెళ్లాను. కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం అప్పలరాజు సినిమాను మధ్యనే మార్నింగ్ షో కి వెళ్లి చూశాను.థియేటర్ మొత్తానికి పది మంది ఉన్నారు.ఒక డైరెక్టర్ తను తీయాలనుకునే విధంగా సినిమాను తీయలేని నిస్సహాయ స్థితిని వర్మ గారు చాలా బాగా చూపించారు.సమకాలీన సినీ పరిశ్రమ మీద సినిమా ఒక మంచి సెటైర్.

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

తెలంగాణా వాదుల దాడులనుండి రక్షణ కు ఒక మార్గం.

హైదరాబాదు లో ఉన్న మార్వాడీలు,హిందీ వాళ్ళు ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు బాగానే ఉన్నారు .కానీ సీమామ్ధ్ర ప్రజలు మాత్రం దాడులకు గురవుతామని బాధ పడుతున్నారు.వీళ్ళు కూడా ఇటువంటి భయాల నుండి దూరం కావడానికి తెలుగు భాష మాట్లాడడం మానుకొని 'ఎం చాట ' లాంటి అలీ గారు చెప్పిన కొత్త భాషను సృష్టించు కొని మాట్లాడడం ప్రారంభించాలి.అప్పుడు వాళ్ళు ప్రాంతం వారో తెలుసు కోవడం తెలంగాణా వాళ్లకు కష్టం అవుతుంది.ఒక కొత్త భాషను సృష్టించిన క్రెడిట్ దక్కుతుంది మరియు దాడుల నుండి కూడా రక్షణ పొంద వచ్చు. విధంగా తెలంగాణా వాదులు ఒక కొత్త భాష పుట్టుక కు కారణ మవుతారు.వారికి ధన్య వాదాలు.

17, ఫిబ్రవరి 2011, గురువారం

జే.పి.గారి పై దాడి ప్రజాస్వామ్యం పై దాడి.

జే.పి. గారి మీద దాడిని ప్రజాస్వామ్యం మీద దాడి గా పరిగణించాలి.దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించి వారిని రాజకీయాలలో పాల్గొనకుండా నిషేధించాలి.ఇప్పుడు రాష్ట్రం లో పరిపాలన స్తంభించి అన్ని వ్యవస్థలు నిర్విర్యమై పోయినాయి.రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే టి.ఆర్.ఎస్. వాళ్ళు జే.పి. పై దాడికి ధైర్యం చేసే వారా? ఇప్పుడు రాష్ట్రంలో చేతగాని వాళ్ళ పాలన నడుస్తా ఉంది.ముఖ్యంగా టి.ఆర్.ఎస్. వాళ్లకు ఇప్పుడే తెలంగాణా రావడం ఇష్టం లేదు.వాళ్ళు బలపడి మిగతా పార్టీలు బలహీనము ఐన తర్వాత మాత్రమే తెలంగాణా రావాలని కోరుకుంటున్నారు.దాని కే ఇటువంటి అప్రజాస్వామిక పనులకు పాల్పడుతున్నారు.తెలంగాణా వస్తే ఇటువంటి ఫ్యూడలిస్టుల చేతుల్లోకి పరిపాలన వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు.జే.పి. గారు ఇటువంటి వాటికి భయపడకుండా ధైర్యంగా రాజకీయాలలో ముందుకు వెళ్లి సమాజంలో ఇటువంటి అనైతిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలి.జే.పి. గారి పై దాడిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి.

12, ఫిబ్రవరి 2011, శనివారం

టి.డి.పి. పార్టీ మరొక సారి విశ్వసనీయత కోల్పోయింది.

జగన్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్స్ కు తెలుగు దేశానికి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఇన్ని రోజులు కొంత మంది అంటూ ఉండే వాళ్ళు,ఇప్పుడు అది నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది.ఎందు కంటే వాళ టి.ఆర్.ఎస్. వాళ్ళు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతాము మద్దత్తు ఇవ్వమంటే టి.డి.పి వాళ్ళు వెనకడుగు వేస్తాఉన్నారు. వాళ టి.డి.పి వాళ్ళు ఒక వైపు ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని ఊర్లు పట్టు కొని తిరుగు తున్నారు,మరొక వైపు అవిశ్వాస తీర్మానానికి మద్దత్తు ఇవ్వమని చెబుతున్నారు.ఒక వేళ అవిశ్వాసానికి మద్దత్తు ఇవ్వకుంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పనైనా చెప్పాలి ,లేక పొతే ఊర్లలో వీళ్ళు చెప్పే నాటకాలను ప్రజలు ఎవరూ విశ్వసించరు.ఇటువంటి పనులు చేసి టి.డి.పి. మరియు వాళ్ళ అధినాయకుడు ప్రజలలో విశ్వసనీయత మరొక సారి పోగొట్టు కున్నారు .

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

హోల్ సేల్ గా అమ్మేశారు

ఎలెక్షన్ల ముందు టిక్కెట్లను రీటైల్ గా అమ్ముకొని ,ఇప్పుడు పార్టీనే హోల్ సేల్ గా అమ్మేశారు.

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

బాక్స్ బద్దలైంది..

చిరంజీవి తో పొత్తు విషయం తెలియగానే కాంగ్రెస్స్ నేత వెంకట స్వామి ఫైర్ అయ్యారు.నేరుగా అధినేత మీద నే విమర్శనాస్త్రాలు సంధించారు.ఆమెనే అధ్యక్ష పదవినుండి దిగిపోయి భారతీయునికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్స్ పార్టీ లో లుకలుకలు మొదలయ్యాయి.చివరికి అది మునిగి పోతుంది.జగన్ పార్టీ నే సరికొత్త పార్టీ గా అవతరిస్తుంది.

అమ్మయ్య ..భారాన్ని దింపేసు కుంటున్నాను..

ఏదో ప్రజలను ఉద్దరిస్తానని సినిమా డైలాగులు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన చిరంజీవిని ఆంధ్ర ప్రదేశ్ తెలివైన ప్రజలు ఆయన్ను పద్దెనిమిది సీట్లకు మాత్రం పరిమితం చేసారు.ఆయనతో పాటు ఉన్న మేధావులంతా ఈయన వ్యవహారం నచ్చక ఎప్పుడో వెళ్లి పోయారు.ఆయన వ్యక్తిత్వాన్ని మన రాష్ట్ర ప్రజలు చాలా బాగా అంచనా వేసారు.అందుకే అధికారానికి దూరంగా పెట్టినారు.ఆయన కు పార్టీ భారంగా పరిణమించింది.ఎప్పుడె పుడు కాంగ్రెస్ లో విలీనం చేయాలని మునిగాళ్ళ మీద నిలబడి ఉన్నాడు.వాళ్ళు అడిగినా అడగక పోయినా మద్దత్తు ఇస్తానని చెబుతున్నాడు.ఈయన మన రాష్ట్రం లో ఇంకొక విశ్వసనీయత లేని నాయకుడిగా మిగిలి పోయారు.చివరకి భారాన్ని దింపుకుంటున్నారు .తమ స్వార్థ ప్రయోజనాల కోసం దినం ఒక మాట మాట్లాడే ఇటువంటి అవకాశవాదులని ప్రజలు జాగ్రత్తగా గమనించి అవకాశం వచ్చినపుడు తగిన బుద్ది చెబుతారు.