29, మార్చి 2010, సోమవారం

వై.ఎస్.కుటుంబం పై బురద జల్లుడు కార్యక్రమం తిరిగి మొదలైంది .

వై.ఎస్ కుటుంబం మీద బురద జల్లుడు కార్యక్రమం తిరిగి మొదలైంది.తొంబైలలో హైదరాబాదు నగరంలో మత కలహాలు జరిగినపుడు అప్పటి ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారిని దించడానికి రాజశేఖరరెడ్డి గారే మతకలహాలు సృష్టించారని దుష్ప్రచారం గావించారు.దానిపైన ఒక కమిటీ ని కూడా వేసారు.చివరికి కమిటీ రాజశేఖరరెడ్డి హస్తం లేదని తేల్చింది. రాజశేఖరరెడ్డి గారి మీద ఉన్న ప్రజాభిమానాన్ని, రాజకీయ గ్లామర్ ను చూసి ఓర్వలేని కొన్ని పత్రికలు ,కాంగ్రెస్స్ పార్టీ లోని సోకాల్డ్ సీనియర్ నాయకులు ,ప్రతిపక్షాలు కలిసి ఆయనను ఫాక్షనిష్టు అని హత్యలు చేయిస్తారని విష ప్రచారం గావించాయి.ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత ప్రజా రంజకంగా పాలన సాగించారో,ప్రజలను ఎంతగా ప్రేమిస్తారో ,సామాన్య ప్రజలు ఎంత సులభంగా ఆయనను కలుసుకోవచ్చో తెలిసింది.అదే ఆయన మీద విష ప్రచారం లేనట్లయితే ఆయన ఇరవై సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి అయి ఉండేవారు.అప్పుడు రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. వాళ ఉన్న ప్రాంతీయ వాదాలు తలెత్తేవి కావు.ఆయన చనిపోయిన తర్వాతకూడా ఆయనను శత్రువులు కూడా తలుచుకుంటున్నారు,ఆయన ఉంటే ఈవాళ రాష్ట్రానికి పరిస్థితి దాపురించేది కాదని.

వాళ హైదరాబాదు లో మత కలహాలు జరిగితే దానికి కూడా పరోక్షంగా జగన్ మీద వేలెత్తి చూపిస్తున్నారు.జగన్ రాజ కీయ గ్లామర్ ను ఎదుర్కోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు ,ప్రతిపక్షం వాళ్ళు ,జనాకర్షణ లేని నాయకులు రాజశేఖరరెడ్డి గారిని దెబ్బతీసినట్లుగా దెబ్బ తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినారు.దీన్ని జగన్ సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళ నాన్న లాగ రాజకీయాలలో రాటుదేలి ,తిరుగు లేని నాయకుడుగా ఎదుగుతాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

21, మార్చి 2010, ఆదివారం

బెహన్ జీ నోట్ల దండలు

తమను ఉద్దరిస్తారని ఎంతో ఆశతో మాయావతి గారిని అధికారంలోకి తీసుక వచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా దళితుల భ్రమలు తొలగిపోయాయి.అక్కడ ప్రజలు ఎంతో పేదరికంతో మగ్గి పోతుంటే మాయావతి గారు ఇవేమీ పట్టకుండా పార్కులు,ఏనుగు శిల్పాలు,తన ప్రతిమలను రాష్ట్రం అంతటా పెడుతూ ,నోట్ల దండలను వేయించు కుంటూ ప్రజా ధనాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.అగ్రవర్ణాల ముఖ్యమంత్రులకు మాత్రం తీసి పోకుండా ఇంకా కొంచం ఎక్కువగానే మాయావతి గారు ప్రజాస్వామ్యాన్ని చాలా అపహాస్యం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒక సారి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కులం వాళ్లైనా, మతం వాళ్లైనా వాళ్ళ లక్ష్యం ప్రజలను రాబందుల్లాగా పీక్కు తినటమే అని మరోసారి జువైనది. తమ కులం వాళ్లకు రిజర్వేషన్ లు ఇచ్చి ,తమ కులం వాళ్ళను ముఖ్యమంత్రులను చేయాలని అలా చేస్తే తమకు వాళ్ళు ఏదో ఒరగ పెడతారని ప్రజలు భావించి పోరాటాలు చేయడం మాను కోవాలి.

13, మార్చి 2010, శనివారం

నీరు ఉండి నీరు లేని భారతదేశం!

మధ్యన ఒక నివేదిక లో ప్రపంచం లో ఎక్కువ భూగర్భ జలాలు వినియోగించే దేశాల్లో భారత దేశం కూడా ముందు భాగంలోఉంది,మరో ఇరవై ఏళ్లలో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే స్థితి భారత దేశానికి దాపురించ వచ్చు,అనే వార్త చదివి పోస్ట్ వ్రాస్తున్నాను.

మనదేశం ఎన్నో జీవనదులకు పుట్టినిల్లు. అటువంటి దేశం లో ఇప్పటికీ గుక్కెడు మంచినీళ్ళ కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కిలోమీటర్ల కొద్దీ పోయి తెచ్చుకోవలసిన పరిస్థితి ఉంది.దీనికంతటికీ కారణం పాలకులకు ముందుచూపు లేక పోవడం,వాళ్ళ అక్రమసంపాదనే కారణం.ప్రజలు నీళ్ళ కోసం ఇంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా పాలకులు మాత్రం శీతల పానీయాలు,మినరల్ వాటర్ తయారు చేసే బహుళ జాతి కంపెనీలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇచ్చారు.బహుళ జాతి కంపెనీలు ఒక లీటర్ శీతల పానీయం తయారుచేయడానికి తొమ్మిది లీటర్ల నీటిని వృధా చేస్తారని నేనెక్కడో చదివాను. విధంగాభూగర్భ జలాలను వృధా చేసుకుంటూ పొతే భూగర్భ జలాలు ఇంకి పోవడానికి ఇరవై సంవత్సరాలు అవసరం లేదు,అంతకంటే ముందే ఇంకి పోతాయి.

నేను ఒక సారి త్రివేణి సంగమం,వారణాసి కి వెళ్ళాను.అక్కడ పెద్ద సముద్రమంత నీళ్ళు ఉన్నాయి,కానీ ఒక గ్లాసు నీళ్ళు కూడా త్రాగలేని దౌర్భాగ్య పరిస్థితి,అంత అపరిశుభ్రంగా ఉన్నాయి.ఒక గ్లాసు నీళ్ళు త్రాగితే చాలు ఖచ్చితంగా కైలాసానికి పోవచ్చు.ప్రజలు ఒక వైపు" గంగా మాతా " అంటూ పూజలు చేస్తున్నారు,మరో వైపు అక్కడే మల మూత్ర విసర్జన చేస్తున్నారు.పూజల పేరుతో ప్రజలు ,పారిశ్రామికవ్యర్థాలను వదులుతూ ఫ్యాక్టరీలు విధంగా జీవనదులను కాలుష్యం చేసుకుంటూ పొతే చివరికి ప్రజలకు గుక్కెడు మంచినీరు లేకుండా పోతుంది.విశ్వహిందూ పరిషత్,శివసేన మరియు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు అనవసర విషయాలలో ప్రజలను రెచ్చగొట్టకుండా,నదులను అపరిశుభ్రం చేయ కుండా హిందూ సమాజాన్ని చైతన్య వంతులను చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారు అవుతారు. ముఖ్యంగా పాలకులు తమ స్వార్థ చింతన పక్కన పెట్టి దూరదృష్టి తో ఆలోచించి జీవనదులను కాలుష్యం బారినపడకుండా ,భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లు వాడకుండా కట్టడి చేయ వలసిన అవసరం ఎంతో ఉంది,లేక పొతే భవిష్యత్ తరాలకు ఒక గ్లాసెడు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురిస్తుంది.


9, మార్చి 2010, మంగళవారం

ఎవరికోసం ౩౩ శాతం మహిళా రిజర్వేషన్లు?

ఈ వాళ ౩౩ శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చినందు వలన నిజంగా తెలివైన మహిళలకు ,సమాజహితం కోరే మహిళలకు ఏమీ ఉపయోగం ఉండదు.ఇప్పటికే రాజకీయాల్లో పాతుకు పోయి ఆ రాజకీయాలనే సంపాదన మార్గంగా ఎంచుకున్న దొరలకే ఉపయోగం ఉంటుంది.మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన స్థానాల్లో ఇప్పటికే పాతుకు పోయిన ప్రజాప్రతినిధుల భార్యలనో,తల్లులనో ,సోదరీమనులనో నిలబెట్టి గెలిపించుకుంటారు.రాజకీయాలు తిరిగి వాళ్ళ చేతుల్లోకే పోతాయి.సామాన్య ప్రజలు నిలబడితే గెలిచే పరిస్థితి లేదు.ఉదాహరణకు మార్పుకోసం వచ్చిన లోక్సత్తా పార్టీ పరిస్థితి ఏమైందో మన అందరికీ తెలుసు.దళిత రిజర్వేషన్లు పొంది ప్రజాప్రతినిధులు అయిన దళిత సోదరులు ఈ వాళ వాళ్ళ దళితులకు ఏమి చేస్తున్నారు,దళిత దొరలూ అయి వాళ్ళ ఆస్తులు పెంచు కోవడం తప్ప. ముఖ్యంగా ప్రజల భావన లో మార్పు రావాలి. అంతవరకూ రిజర్వేషన్లు ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా పరిస్థితిలో మార్పు ఉండదు.

6, మార్చి 2010, శనివారం

కాంగ్రెస్స్ మార్క్ రాజకీయానికి చిత్తైన కే.సి.ఆర్

మాటిమాటికి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఇప్పటివరకూ తన రాజకీయ పబ్బం గడుపుకొస్తున్న కే.సి.ఆర్ కు అదే రాజీనామా అస్త్రం బూమ్రాంగ్ లా తిరిగి వచ్చి తన మెడకే చుట్టుకునేటట్లుగా ఉంది.తన నిర్ణయాల్ని తెలంగాణా జే..సి. నిర్ణయాలుగా చెబుతూ ,ముందుగా రాజీనామాలు చేసి తెలంగాణా ప్రజల దృష్టి లో హీరో అయిపోదామని చూసారు.కానీ టి.ఆర్.ఎస్ వాళ్ళు,ఒక బి.జే.పి ఎం.ఎల్. తప్పకాంగ్రెస్స్ ,టి.డి.పి. వాళ్ళు ఒక్కరు కూడా రాజీనామాలు సమర్పించలేదు. వాళ తెలంగాణా లో అమరులైన విద్యార్థుల బంధువులను రాజీనామాలు చేసిన స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని డిమాండ్ ఊపందుకుంది.చనిపోయిన శ్రీకాంతాచారి తండ్రిని డిల్లీ లో కాంగ్రెస్స్అధిష్టానం పిలిపించి పరామర్శించింది. పరిస్థితులలో కే.సి.ఆర్ ,టి.ఆర్.ఎస్ వాళ్ళ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.కాంగ్రెస్స్ వాళ అన్ని స్థానాల్లో అమరులైన విద్యార్థుల బంధువులను నిలబెట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు.ఎందుకంటే కాంగ్రెస్స్ వాళ్లకు పోయేది ఏమీ లేదు,వస్తే టి.ఆర్.ఎస్. స్థానాలు తన వశం అవుతాయి.ఒక వేళ టి.ఆర్.ఎస్ వాళ్ళు స్థానాల్లో పోటీ చేస్తే తెలంగాణా ప్రజల దృష్టి లో దోషి గా నిలబెట్ట వచ్చు. పరిస్థితులల్లో కే.సి.ఆర్ ఎటువంటి చాణుక్య నీతిని చూపుతారో వేచిచూడాలి.కాంగ్రెస్స్ రాజకీయమా మజాకా!

4, మార్చి 2010, గురువారం

టి.ఆర్.ఎస్ రాజీనామా చేసిన స్థానాల్లో అమరులైన విద్యార్థుల బంధువులను నిలబెట్టి ఏకగ్రీవంగా గెలిపించు కోవాలి .

రాజీనామా చేసిన టి.ఆర్.ఎస్ ప్రజా ప్రతినిధులకు ,కే .సి.ఆర్ కు తెలంగాణా మీద నిబద్దతను చాటుకునే మంచి ఆవకాశం ఇప్పుడుదొరికింది.వారు రాజీనామా చేసిన స్థానాల్లో అమరులైన విద్యార్థుల తల్లిదండ్రులను గానీ ,వారి సోదర ,సోదరీమణు మణులను నిలబెట్టి (లగడపాటి రాజగోపాల్ గారు చెప్పినట్లు) ఏకగ్రీవంగా తెలంగాణా జే..సి వాళ్ళు ఎన్నుకోవాలి.అప్పుడు మాత్రమే టి.ఆర్.ఎస్ వాళ్ళు చేసినది డ్రామా కాదు ,వాళ్ళు పదవులకోసం ప్రాకులాడే వాళ్ళు ఏమాత్రం కాదు అని తెలంగాణా ప్రజలకు తెలిసి టి.ఆర్.ఎస్ మీద తెలంగాణా ప్రజలలోగౌరవం పెరుగు తుంది. విషయమై .యు విద్యార్థులు మరియు తెలంగాణా జే..సి కృషి చేస్తే బావుంటుంది.అప్పుడు మాత్రమే అమరులైన తెలంగాణా విద్యార్థులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.

2, మార్చి 2010, మంగళవారం

ప్రజాప్రతినిధులను భాధ్యులుగా చేయాలి.

ప్రజా ప్రతినిధులు మరియు మంత్రులు మా ప్రాంతం అభివృద్ధి కాలేదు మా ప్రాంతం అభివృద్ధి కాలేదు అని పోటీ పడి ప్రకటనలు ఇస్తూ, దానికి ప్రత్యక రాష్ట్రమే పరిష్కారం అని చెబుతున్నారు.ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ,వాళ్ళ నియోజక వర్గాలకు విడుదలైన నిధులవివరాలను ప్రకటించి ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజా ప్రతినిధులను కనుక్కొని ప్రజా ప్రతినిధులను భాధ్యులుగా చేసి శిక్షించాలి.ప్రజాప్రతినిధులను భాధ్యులుగా చేయనంత వరకూ రాష్ట్రం ఎన్ని ముక్కలైన ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు.